హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. వరంగల్-కరీంనగర్ రహదారికి మోక్షం: బండి సంజయ్

|
Google Oneindia TeluguNews

నేషనల్ హైవే విస్తరణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. దీంతో తెలంగాణ‌ రాష్ట్రంలో ప‌లు మార్గాల్లో ట్రాఫిక్ క‌ష్టాలు తీరనున్నాయి. కరీంనగర్, వరంగల్ రహదారిపై జనం పడుతున్న కష్టాలకు చెక్ పడనుందని వివరించారు. 4 లైన్ల నేషనల్ హైవే విస్తరణ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. కేంద్ర రోడ్డు, రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ 26.69 హెక్టార్ల‌ భూ సేకరణకు గెజిట్ విడుదల చేసిందని బండి సంజ‌య్ వివ‌రించారు.

రద్దీగా ఉండే రహదారిని 4 లైన్లుగా విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం భారత్ మాలా ఫేజ్ 1 లో చేర్చిందని తెలియజేశారు. 67 కిలోమీటర్ల రహదారిని 4 లైన్ల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందుకోసం 305.47 హెక్టార్ల భూ సేకరణ అవసరం ఉంది. 47.14 హెక్టార్ల భూమి ఇప్పటికే అందుబాటులో ఉండగా, ఇంకా 258.33 హెక్టార్ల సేకరణ ప్రక్రియ కొనసాగనుంది. 167.14 హెక్టార్ల భూ సేకరణ ప్రక్రియ పూర్తి అయ్యే గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది అని బండి సంజ‌య్ పేర్కొన్నారు.

karimnagar warangal road will 4 line national highway

Recommended Video

Hyderabad : నిమ్స్‌లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

మిగిలిన 91.19 హెక్టార్లలో 26.69 హెక్టార్ల భూసేకరణకు గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మిగిలిన 64.5 హెక్టార్ల భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లు త్వరలోనే వస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భూసేకరణ ప్రక్రియ పూర్తికాగానే 4 లైన్ల విస్తరణ పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాను అని బండి సంజ‌య్ తెలిపారు.

English summary
karimnagar warangal road will 4 line national highway bjp mp bandi sanjay said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X