హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు టీఆర్ఎస్‌లో చేరిక.. ముహూర్తం ఖరారు, ఎల్ రమణకు ప్రాథమిక సభ్యత్వం

|
Google Oneindia TeluguNews

ఎల్ రమణ టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రాథమిక సభ్యత్వం ఇస్తారు. ఎల్ రమణ ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ప్రాథమిక సభ్యత్వం తీసుకుంటారు రమణ. ఈ నెల 16వ తేదీన సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతారు. అనుచరులు, అభిమానులతోపాటు పలువురు టీటీడీపీ నేతలతో కలిసి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. మూడు రోజుల క్రితం ఆయన ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిపిన సంగతి తెలిసిందే.

రమణ రాజకీయ భవిష్యత్‌పై సీఎం కేసీఆర్ స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. రెండు మూడు నెలల్లో తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ ఏర్పడనుంది. ఇందులో ఒకటి రమణకు ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లుగా సమాచారం. సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఆయన టీటీడీపీ అధ్యక్ష పదీవీకి రాజీనామా చేశారు.

L ramana monday joined to trs party

Recommended Video

Weather Update : Two More Days Heavy Rains In AP & Telangana | Oneindia Telugu

హుజురాబాద్ సీటు దక్కించుకోవడం టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్టాత్మకం.. ఈటల రాజేందర్‌ను ఎలాగైనా ఓడించాలని కంకణం కట్టుకున్నారు. అందుకోసమే రమణను పార్టీలోకి ఆహ్వానించి మరీ.. పోటీ చేయించబోతున్నారు. పోటీ చేసి గెలిచినా పదవే, ఓడినా పదవీ ఇస్తామని చెప్పారని సమాచారం. రమణ కూడా గట్టిగా ట్రై చేసి.. మంత్రివర్గంలోకి వచ్చేందుకు తగిన ప్రణాళిక వేసుకున్నారని తెలుస్తోంది. అందుకోసమే.. తాను ఇన్నాళ్లు ఉన్నా పార్టీని కాదని, టీఆర్ఎస్‌లో చేరతానని చెప్పారని సమాచారం.

English summary
L ramana monday joined to trs party. working president ktr give primary membership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X