లాయర్లు వామన్ రావు దంపతుల హత్యకేసు ... కుంట శ్రీనివాస్ తో పాటు నిందితుల అరెస్ట్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది దంపతుల జంట హత్యల వెనుక రాజకీయ ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువగా మారాయి. గట్టు వామన్ రావు దంపతులను పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా విచక్షణారహితంగా దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. సిసి టివి ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటికే ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన కుంట శ్రీనివాస్ కోసం గాలించిన పోలీసులు ఎట్టకేలకు కుంటా శ్రీనివాస్ ను పట్టుకున్నారు.

మహారాష్ట్ర సరిహద్దుల్లో నిందితుల అరెస్ట్
ఈనెల 17వ తేదీన వామన్ రావు దంపతులను అత్యంత దారుణంగా హతమార్చారు. ఆరు బృందాలుగా నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు, ఈ హత్యకు సంబంధించి కుంటా శ్రీనివాస్, కిరణ్, కుమార్ లను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. వామన్ రావు దంపతులను హత్య చేసిన తర్వాత నిందితులను మహారాష్ట్ర సరిహద్దులో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. వామన్ రావు దంపతుల కదలికలను కుమార్ రెక్కీ నిర్వహించాడని, శ్రీనివాస్ కు సమాచారం అందించారని తెలుస్తుంది . శ్రీనివాస్ తో పాటు కిరణ్ ను, అక్కపాక కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇప్పటికే ముగ్గురిని విచారిస్తున్న పోలీసులు .. రాత్రి మీడియా ముందుకు
ఇంతకు ముందు మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు . చిరంజీవి, కుమార్, దాస్ లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
వారిని విచారిస్తున్నారు.
ఇక ఈ రోజు రాత్రి వీరిని మీడియా ముందుకు తీసుకు వచ్చే అవకాశం కూడా ఉంది. దేవాలయ భూముల కు సంబంధించిన వివాదమే హత్యకు దారితీసిన ట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అయితే దేవాలయ భూముల కు సంబంధించిన వివాదం చిన్న విషయమని, వామన్ రావు దంపతుల హత్య వెనుక రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు.

వామన్ రావు దంపతుల హత్య వెనుక రాజకీయ నాయకులు .. మృతుని కుటుంబం ఆరోపణ
వారి హత్య వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని, వారిని తక్షణం అదుపులోకి తీసుకొని, తగిన శిక్ష విధించాలని మృతుని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. హైకోర్టు న్యాయవాదుల జంట దారుణ హత్యకు నిరసనగా ఈరోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో మంథని బంద్కు పిలుపునిచ్చారు. మంథని లో బంద్ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా న్యాయవాదులు న్యాయం చేయాలని, ఈ కేసును సిట్టింగ్ జడ్జితో తక్షణం విచారణ జరిపించాలని ఆందోళన నిర్వహించారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications