hyderabad: ఆస్పత్రిలో కూలిన లిఫ్ట్ -లోపల ఉప్పల్ ఎమ్మెల్యే, బోడుప్పల్ మేయర్ -ప్రమాదంలో..

హైదరాబాద్: నగర పరిధిలోని ఉప్పల్ లో గురువారం చోటుచేసుకున్న ఓ భారీ ప్రమాదం నుంచి స్థానిక ప్రజా ప్రతినిధులు సురక్షితంగా బయటపడ్డారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆ ముఖ్యనేతలు లిఫ్ట్ లో ప్రయాణిస్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలింది. వివరాలివి..

ఉప్పల్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి గురువారం ఉప్పల్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రి వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఎమ్మెల్యే వెంట బోడుప్పల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ మేయర్ బుచ్చిరెడ్డి, ఇంకొందరు కీలక నేతలు కూడా ఉన్నారు. కాగా,

lift accident in hyderabad: uppal trs mla bethi subhas reddy escape after an elevator collapse

ఆస్పత్రిలోని లిఫ్టు ద్వారా పై అంతస్తుకు వెళుతుండగా, అది కూలిపోయింది. ఈ ఘటనలో మేయ‌ర్ బుచ్చిరెడ్డితో పాటు ప‌లువురికి స్వ‌ల్ప గాయాలు కాగా, ఎమ్మెల్యే సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డంతో ఆస్ప‌త్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. మరి,

నిత్యం వందల మంది రోగులు వచ్చే ఆస్పత్రిలో లిఫ్టు కుప్పకూలిపోవడం కలకలం రేపింది. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వెంట అనుచరగణం భారీగా వచ్చారి, పరిమితికి మించి లిఫ్టులోకి ఎక్కడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+