Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Liger..మేనియా: ఫ్యాన్స్ పండగ: విజయ్-పూరీ కాంబో వర్కవుట్ అయిందా?: ట్విట్టర్ ఏం కూస్తోంది?

హైదరాబాద్: మచ్ ఎవైటెడ్ మూవీ.. లైగర్. ఇవ్వాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. విజయ్‌ దేవరకొండ, బాలీవుడ్ నటి అనన్య పాండే నటించారిందులో. పూరీ జగన్నాథ్ దర్శకుడు. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. బాక్సింగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో పాన్‌ ఇండియా సినిమాగా తెరకెక్కింది. పాన్ ఇండియా మూవీ కావడం వల్ల దేశవ్యాప్తంగా ప్రమోషన్స్‌ గ్రాండ్‌గా ప్లాన్ చయడం వల్ల హైప్‌ క్రియేటయింది.

Recommended Video

    ఆ ఒక్క ఫోటో వల్ల చాలా మాటలు వినాల్సి వచ్చింది... hero vijay devarakonda *Enteraiment

    ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో

    ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఈ సినిమా విడుదలతో.. టాలీవుడ్‌లో లైగర్ మేనియా కమ్ముకుంది. సినిమా అడ్డా పేరున్న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో పండగ వాతావరణం కనిపించింది. మెయిన్ థియేటర్ సుదర్శన్‌ వద్ద విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ఫ్యాన్స్ భారీ సంఖ్యలో చేరుకున్నారు. బాణాసంచా కాల్చారు. కాగితాలను ఎగురవేశారు. దీని కోసం డ్రోన్‌ను వినియోగించడం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, అనన్య పాండే అభిమానులతో కలిసి సినిమా చూశారు.

    పూరీ మార్క్..

    ఫస్ట్ షో ఫినిష్ అయిన కొద్ది సేపటికే ట్విట్టర్ రివ్యూస్ కూడా వచ్చేశాయి. డివైడెడ్ టాక్‌ను తెచ్చుకుందీ మూవీ. ఫస్ట్ హాఫ్ సోసో గా ఉన్నప్పటికీ.. సెకెండ్ హాఫ్ అద్దిరిపోయిందంటూ కొందరు నెటిజన్లు రివ్యూస్ ఇచ్చారు. పూరీ జగన్నాథ్ మార్క్ సెకెండ్ హాఫ్‌లో ఉందంటూ కితాబిచ్చారు. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచాడని, అతని కోసమైనా మూవీకి వెళ్లొచ్చంటూ కొంతమంది ట్విట్టర్ యూజర్లు కామెంట్స్ చేశారు.

    అదరగొట్టిన దేవరకొండ..

    ఈ మూవీలో విజయ్ దేవరకొండ పెర్‌ఫార్మెన్స్ అదరగొట్టిందంటూ ఆయన అభిమానులు కామెంట్స్ పోస్ట్ చేశారు. ఈ సినిమాతో విజయ్ మరో మెట్టు పైకెక్కాడని పేర్కొన్నారు. లైగర్ బాగోలేదంటూ మరి కొందరు ట్వీట్ చేశారు. రాను రాను పూరీ జగన్నాథ్- తన గురువు రామ్ గోపాల్ వర్మలా తయారవుతున్నాడంటూ వ్యాఖ్యానించారు. టెక్నికల్‌గా సినిమా అత్యున్నతంగా ఉందని మరి కొందరు రివ్యూ ఇచ్చారు. సినిమాకు మూలాధారమైన కథలో కొత్తదనం కొరవడిందంటూ తమ అభిప్రాయాలను ట్విట్టర్ అకౌంట్స్‌పై రాసుకొచ్చారు.

    యాంటీ ఫ్యాన్స్ పని..

    యాంటీ ఫ్యాన్స్ పని..

    లైగర్ సినిమా మీద విజయ్ దేవరకొండ యాంటీ ఫ్యాన్స్ నెగెటివ్ రివ్యూస్ ఇస్తోన్నారంటూ మరి కొందరు ట్విట్టర్ యూజర్లు అభిప్రాయపడ్డారు. పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ అదర గొట్టిందని చెబుతున్నారు. సినిమాలో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ- వాటన్నింటినీ పూరీ మార్క్ దర్శకత్వం, విజయ్ స్టైల్ యాక్టింగ్ ఓవర్ కమ్ చేసిందంటూ స్పష్టం చేస్తోన్నారు. సినిమా చూడొచ్చంటూ రివ్యూ ఇస్తోన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+