లాక్‌డౌన్ పొడగింపు: మరో 10 రోజులు.. 1 గంటవరకు అనుమతి..
తెలంగాణలో లాక్ డౌన్ పొడగించారు. మరో 10 రోజులు ఎక్స్‌డెంట్ చేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కానీ సడలింపులు మాత్రం ఇచ్చారు. ఇప్పుడు ఉన్న ఉదయం 6 గంటల నుంచి 10 గంటల స్థానంలో.. మధ్యాహ్నాం 1 గంట వరకు రిలాక్సేషన్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరునాడు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ ఉంటుంది.
సడలింపు సమయం తర్వాత బయటకు వెల్లిన వారు ఇంటికి చేరడానికి మరో గంట పాటు, అంటే మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం ఇస్తారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి తెల్లారి ఉదయం ఆరు గంటల దాకా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం నాడు సమావేశమైన రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Recommended Video
మే 12వ తేదీ నుంచి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తొలుత వారం రోజులు.. తర్వాత 10 రోజులు లాక్ డౌన్ విధించారు. ఇటు ఫీవర్ సర్వేను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్న వారికి వైద్య సేవలు అందించాలని సూచించింది. వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎరువులు, విత్తనాలు నకిలీల విషయంలో కఠినంగా ఉండాలని, ధాన్యం సేకరణ మరింత వేగవంతం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications