• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

లోక్‌సభ ఎన్నికలు 2019 : ఓటుకు 5 రకాలుగా చోటు

|

హైదరాబాద్ : లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. దేశ పౌరులుగా ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. దేశమంతటా దశలవారీగా పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ప్రజాస్వామ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించింది రాజ్యాంగం. ఓటు ద్వారానే మంచి నేతలను ఎన్నుకునే అవకాశముంది. అయితే ఓటు ఎన్ని రకాలుగా ఉంటుంది. ఏఏ రూపాల్లో ఓటు వేయొచ్చు అనే అంశాలపై ప్రత్యేక కథనం.

ఎన్నారైలు కోటిన్నర..! ఓట్లున్నాయి 70 వేలే.. 0.5 శాతమేనా?

ఓట్లు వేసే విధానాలను బట్టి 5 రకాలుగా విభజించారు. జనరల్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్, ఎన్నారై, టెండర్ ఓటు, సర్వీస్ ఓటు.. ఇలా 5 రకాలుగా ఓట్లు వేయొచ్చు.

ఎన్నికల స్టంటే : ఆ ఘనత మీది కాదు ..? టెలిగ్రాఫ్ రిపోర్టర్‌దేనన్న విపక్షాలు

 జనరల్ ఓటింగ్

జనరల్ ఓటింగ్

18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయ పౌరుడు ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుని ఓటు హక్కు పొందాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారం 6 నింపి ఓటు హక్కు పొందొచ్చు. ఓటర్ల జాబితాలో నమోదయ్యాక ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అర్హులౌతారు. ఎన్నికల వేళ పోలింగ్ స్టేషన్లో ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన గుర్తింపు కార్డు చూపిస్తే ఓటు వేయడానికి అధికారులు అనుమతిస్తారు.

పోస్టల్‌ బ్యాలెట్‌

పోస్టల్‌ బ్యాలెట్‌

ప్రభుత్వ ఉద్యోగాలు చేసే కొందరికి ఎన్నికల డ్యూటీ పడుతుంటుంది. అలాంటి వారు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వెళ్లేవారు ముందుగానే తమ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారో నిర్దేశిత ఫారమ్ నింపి పోస్టులో సంబంధిత ఎన్నికల అధికారికి పంపించాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపు రోజే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కూడా లెక్కిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో పోస్టల్ ఓట్లే కీలకంగా మారి అభ్యర్థులు గెలిచిన దాఖలాలున్నాయి.

టెండర్‌ ఓటు

టెండర్‌ ఓటు

పోలింగ్ బూత్ కు వెళ్లేసరికి ఒక్కోసారి మన ఓటు వేరేవాళ్లు వేసేస్తుంటారు. ఓటర్ జాబితాలో పేరుండి మన ఓటును మనం వేసుకోలేని పక్షంలో రిటర్నింగ్ అధికారిని సంప్రదించవచ్చు. ఓటు హక్కు వినియోగించుకోలేదని ప్రూవ్ చేయాలి. ఒకవేళ రిటర్నింగ్ ఆఫీసర్ అన్నీ ధృవీకరించుకుని ఓకే చెబితే మనం టెండర్ ఓటు వేయొచ్చు.

 సర్వీస్‌ ఓటు.. డిఫెన్స్ స్పెషల్

సర్వీస్‌ ఓటు.. డిఫెన్స్ స్పెషల్

ఇది కేవలం సైన్యం కోసం ఉద్దేశించింది. సైనికులు సర్వీస్ ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశమిచ్చింది. డిఫెన్స్ లో ఉద్యోగాలు చేసేవారు ఎన్నికల వేళ సొంత గ్రామాలకు రాలేని పరిస్థితి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు. అందుకే వారికోసం ప్రత్యేకంగా సర్వీస్ ఓటు తీసుకొచ్చారు. ఓటు ఎవరికి వేస్తున్నారో తెలియజేస్తూ ఆయా డిపార్టుమెంట్ హెడ్స్ ద్వారా లేదంటే పోస్టల్ ద్వారా వారి నియోజకవర్గ పరిధిలోని రిటర్నింగ్ ఆఫీసర్ కు పంపించొచ్చు. ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్‌ఫరబుల్‌ ద్వారా పంపించడమనేది మరో విధానం.

 ఎన్నారై ఓటు

ఎన్నారై ఓటు

గతంలో ఎన్నారైలు ఓటు హక్కు పొందడానికి క్లిష్టతరమైన ప్రాసెస్ ఉండేది. ఈసారి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు ఫారం 6A నింపి తగిన ఆధారాలు జతచేస్తే ఓటు హక్కు కల్పిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. 2019 తాజా ఎన్నారై ఓటర్ల జాబితా ప్రకారం దాదాపు 70వేల పైచిలుకు ఓటర్లుగా నమోదయ్యారు. అందులో 20 మంది హిజ్రాలు కూడా ఉండటం విశేషం. ఎన్నారైలు ఓటు హక్కు పొందినప్పటికీ ఎన్నికల వేళ వారు స్వయంగా వారి నియోజకవర్గాలకు వెళ్లి ఓటు వేయాల్సి ఉంటుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Lok Sabha elections has gone up. Everyone is responsible for using the right to vote as citizens of the country. The Central Election Commission is working to conduct polling in phases across the country. The constitution guarantees the right to vote for everyone qualified in democracy. We can choose good leaders by vote. But the votes are divided into 5 different categories. General voting, postal ballot, NRI, tender vote, service voting etc.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more