Hyderabad: అక్కడ తింటే ప్రాణాల మీదికి తెచ్చుకున్నట్లే.. తనిఖీల్లో బయటపడ్డ షాకింగ్ విషయాలు..!

హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లలో తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడినట్లే. సిటీలోని చాలా రెస్టారెంట్లు, హోటళ్లలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. కుల్లిపోయిన కూరగాయలు, గడువు దాటిన పదార్థాలు, కుల్లిపోయిన మాంసంతో వంటలు చేస్తున్నారు. కొన్ని హెటళ్లలో కెమికల్స్ కూడా వాడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ బృందం సోదారు చేసింది. నవంబర్ 2వ శనివారం సంతోష్ నగర్‌లోని హోటల్ స్వీకర్, స్వాతి హోటల్, హోటల్ శ్రీ రాఘవేంద్ర ఉడిపిలో దాడులు నిర్వహించారు.

హోటల్ స్వీకర్ లో FSSAI లైసెన్స్ ప్రదర్శించలేదని అధికారులు తెలిపారు. ఫుడ్ హ్యాండ్లర్లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు లేవని గుర్తించారు. కిచెన్ దారుణ పరిస్థితులు ఉన్నాయి. పాచీ ఉన్న ఫ్లోర్, ఎక్కడపడితే అక్కడ నీరు నిలిచిపోయింది. కిచెన్ రాక్‌లలో బొద్దింకలు కనిపించాయి. గడువు ముగిసిన మలబార్ పరోటాలు ఉన్నాయి. వంట చేసేవారు, వడ్డించేవారికి తలపాగాలు, అప్రాన్‌లు ధరించలేదని అధికారులు తెలిపారు. ఎలాంటి జాగ్రత్త లేకుండా నేలపై కూరగాయలు నిల్వ చేశారు.

Many violations have been found in the inspections of food safety officials in many hotels in Hyderabad

స్వాతి హోటల్‌లో వంటగదిలో పాచి ఫ్లోర్‌ ఉంది. ఎక్కడ పడితే అక్కడ నీరు నిలిచిపోయింది. ఆహార తయారీలో సింథటిక్ ఫుడ్ కలర్‌లు వాడుతున్నట్లు తెలిసింది. రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసిన ఆహార పదార్థాలు కవర్ చేయలేదు. వంటగదిలో సరైన పరిశుభ్రత పద్ధతులు లేవు. ఫుడ్ హ్యాండ్లర్లు క్యాప్, గ్లౌజ్ లు, అప్రాన్లు ధరించలేదు. ఆవరణలో కనిపించే గోనె సంచులతో సహా ఓపెన్ డస్ట్‌బిన్‌లు ఉన్నాయి. శ్రీ రాఘవేంద్ర ఉడిపి హోటల్ లో పెస్ట్ కంట్రోల్ రికార్డులు, ఫుడ్ హ్యాండ్లర్‌లకు మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు లేవని గుర్తించారు.

వంట గదిలో బొద్దింకలు ఉన్నాయి. స్టోర్‌రూమ్‌లో ఫంగస్ తే ఉన్న అల్లం కనిపించింది. అధికారులు నిరంతర తనిఖీలు చేస్తున్నప్పటికీ పరిస్థితి మారడం లేదు. అందుకే ప్రభుత్వం రెస్టారెంట్లకు రేటింగ్ ఇవ్వాలని యోచిస్తుంది. ఈ రేటింగ్ జాబితాను ఆన్ లైన్ ఉంచనున్నారు. రేటింగ్ ను బట్టి ఆ హోటల్ లో తినాలో లేదో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈ విధానాన్ని మొదటగా గ్రేటర్ హైదరాబాద్ లో అమలు చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+