హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీ మంత్రి బొత్సకు కరోనా పాజిటివ్.. అపోలోలో చికిత్స

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. థర్డ్ వేవ్ అంటున్నారు తప్ప క్లారిటీ లేదు. ఇటు వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుంది. మరోవైపు మంత్రి బొత్స సత్యనారాయణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత వారం రోజులుగా ఆయన హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

మూడు రోజుల ముందు ఆర్టీపీసీఆర్ సెంటర్‌లో నెగిటివ్ అని తేలింది. బయటి కాంటాక్స్ట్ వల్ల తెలిస్తే ఇబ్బంది అని భావించి.. నెగిటివ్ వచ్చినా మూడు రోజులుగా.. ఆస్పత్రిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో టెస్ట్ చేయగా పాజిటివ్ వచ్చింది. మరోవైపు బుధవారం ఉదయం అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటివద్దే హోం ఐసోలేషన్‌లో ఉండే అవకాశం ఉంది.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

 minister botsa satyanarayana infected coronavirus

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు.

ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మాస్క్ ధరించి.. శాని టైజర్ రాసుకొని కాలం వెళ్లదీయాల్సిందేనని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు.

English summary
andhra pradesh minister botsa satyanarayana infected coronavirus. he present treated hyderabad apollo hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X