కిషన్ రెడ్డి కేంద్రమంత్రివా.. కలే, నాటి కేటీఆర్ కామెంట్స్ వైరల్
మంత్రి కేటీఆర్‌ను బీజేపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి. గత లోక్ సభ ఎన్నికల సమయంలో కేటీఆర్ వీడియోను షేర్ చేస్తున్నారు. 2018లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగగా.. టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. కానీ 2019లో మాత్రం ఆశించిన ఎంపీ సీట్లను సాధించలేదు. అయితే లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో కిషన్ రెడ్డిని ఉద్దేశిస్తూ కేటీఆర్ కామెంట్ చేశారు. రాజకీయ శూన్యం ఉందని.. కేంద్రంలో సొంత మెజార్టీ వచ్చే పరిస్థితి లేదని చెప్పారు. కిషన్ రెడ్డి, మోడీపై కూడా కామెంట్ చేశారు. ఇప్పుడు దానిని బీజేపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నారు.
ఏం కామెంట్ చేశారంటే..
ప్రచారంలో భాగంగా కేటీఆర్ బీజేపీకి 150 సీట్లు రావని చెప్పారు. మోడీ ప్రధాని కారని, కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కారని అన్నారు. కేంద్రంలో బీజేపీ అద్బుత విజయం సాధించి.. అధికారం చేపట్టింది. మోడీ ప్రధాని, కిషన్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రి కూడా అయ్యారు. అయితే నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో కిషన్ రెడ్డికి ప్రమోషన్ కూడా వచ్చింది. కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో బీజేపీ టీమ్.. కేటీఆర్‌ను ట్రోల్ చేస్తున్నారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కూడా అయ్యారని కామెంట్ చేస్తున్నారు.

150 కాదు 303
వాస్తవానికి బీజేపీ ప్రభంజనం సృష్టించింది. 303 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవతరించింది. కేటీఆర్ అన్న మాటలను ట్రోల్ చేస్తున్నారు. మోడీ విజయ దుందుబి కొనసాగిందని చెప్తున్నారు. కిషన్ రెడ్డికి కేంద్రమంత్రిగా పదోన్నతి కలిగిందని చెబుతున్నారు. బట్టేబాజ్ మాటలు మాట్లడొద్దు అని సూచించారు. కామెంట్స్ చేయొచ్చు కానీ హద్దు అదుపూ ఉండాలని స్పష్టంచేశారు. బీజేపీ బృందం చేస్తోన్న ట్రోల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేటీఆర్ కామెంట్స్ వీడియో వైరల్ అవుతోంది.
Recommended Video

కేంద్రమంత్రిగా..
కిషన్ రెడ్డికి ప్రమోషన్ వచ్చింది. సహాయ మంత్రి నుంచి కేంద్ర మంత్రి పదవీ వరించింది. ఇక నుంచి కిషన్ రెడ్డి కల్చరల్ పోర్టు పోలియో నిర్వహిస్తారు. కరోనా వల్ల పర్యాటక రంగం కుదేలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు టూరిజం మరింత డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కీలక బాధ్యతను ప్రధాని మోడీ కిషన్ రెడ్డికి ఇచ్చారు. దానిని నెరవేర్చాల్సిన బాధ్యత అతనిపై ఉంది. నార్త్ ఈస్ట్రన్ డెవలప్ మెంట్ డ్యూటీ కూడా ఉంది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
'అమ్మా.. నాకు ఈ యాక్టింగ్ వద్దు!': కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరోయిన్!! -
అవి చూశాక ఎంతో బాధనిపిస్తోంది.. సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్. -
బిల్ గేట్స్ వర్షాలను కంట్రోల్ చేస్తున్నారా? 'వార్' ఆన్ వెదర్! -
ఈ అడవిలోని చెట్ల మధ్య దాగి ఉన్న జంతువును కనిపెట్టగలరా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications