కారణజన్ముడు యోధుడే: ‘వీరయోధ’పాట అదుర్స్, కేటీఆర్ షేర్, కవిత పూజలు
కేసీఆర్ జన్మదినం నేడు.. ఉద్యమనేతగా.. గులాబీ దళపతిగా, ముఖ్యమంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. విపక్షాలను ఏకీపారేసిన.. అదేవిధంగా ప్రశంసించిన ఆయనకే చెల్లింది. ఉద్యమ పార్టీ కాస్త తిరుగులేని రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది. ఇటీవల కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై ఫోకస్ చేశారు. ప్రధాని మోడీ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు.. తరతమ అనే భేదం లేకుండా అందరూ విష్ చేస్తున్నారు. ప్రత్యేక పాట కూడా రూపొందించారు.
పాట విడుదల
కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వీరయోధ అనే పాట రూపొందించారు. ఇందులో కేసీఆర్ అంటే ఏంటో క్లుప్తంగా చెప్పేశారు. పాట భావం, గానం అద్భుతంగా ఉంది. ఆ పాటను మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షేర్ చేశారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా 'వీర యోధ' పాట రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పాట ఉద్వేగభరితంగా ఉందని పేర్కొన్నారు. "భారతీయతే మనకు ప్రాణం... అది కేసీఆర్ హృదయనాదం... నీవెంట నిలుస్తాం, నడుస్తాం... గెలుస్తామయా" అంటూ ఈ గీతం సాగుతుంది. 'వీర యోధ' పాటకు సంబంధించిన వీడియోను కేటీఆర్ పంచుకున్నారు. పాటకు అభిజ్ఞ రచన, గానం అందించగా... ఎస్కే బాజి సంగీతం అందించారు. కే లక్ష్మణ్ నిర్మాణంలో పూర్ణ దర్శకత్వం వహించారు.
కవిత పూజలు
కేసీఆర్ నేడు 68వ పడిలో అడుగుపెట్టారు. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. తండ్రి జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లో గల బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర టీఆర్ఎస్ నేతలతో కలిసి ఆమె ఆలయానికి వచ్చారు. ఆలయ సిబ్బంది ఆమెకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికాయి. పూజ అనంతరం కవితకు తీర్థప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోను మంత్రి తలసాని ట్వీట్ చేశారు.

వారిద్దరూ ఒక్కటే..
కేసీఆర్‌కు రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోడీ కూడా విష్ చేశారు. ఇటీవల మోడీపై కేసీఆర్ విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోడీ శుభాకాంక్షలు తెలియజేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే మోడీ- కేసీఆర్ ఒక్కటేనని.. విమర్శలు పైకి మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఇటీవల ముచ్చింతల్‌లో జరిగిన కార్యక్రమానికి కేసీఆర్ హాజరుకాలేదు. దీనిని బట్టి.. బీజేపీకి దూరంగానే ఉంటున్నారు.












Click it and Unblock the Notifications