హరిక ఎవరూ.. తేలీదే... మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాట్ కామెంట్స్
తెలంగాణ టూరిజం శాఖ బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ స్టార్ కంటెస్టెంట్ దేత్తడి హరిక నియామకంపై రగడ నెలకొంది. ఈ వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. టూరిజం కార్పొరేషన్ డెవలప్‌మెంట్ చైర్మన్ ఆమెను బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటిస్తూ అపాయింట్‌మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చేశారు. అయితే ఈ ఉత్తర్వులు రాష్ట్రప్రభుత్వంతో సంప్రదించకుండానే ఆయన ఇచ్చినట్లు తెలుస్తోంది.
సదరు శాఖ మంత్రి కార్పొరేషన్ చైర్మన్‌పై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎక్సైజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హారిక నియామకం పట్ల సీఎంవోకు గానీ, ఉన్నతాధికారులకు గానీ ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని షాకింగ్ కామెంట్స్ చేశారు.

హారిక ఎవరో కూడా తనకు తెలియదని తేల్చిచెప్పారు. ప్రస్తుతం తాను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని వివరించారు. దీని గురించి త్వరలో పూర్తిస్థాయి విచారణ జరుపుతామని అన్నారు. దీని వెనుక ఎవరున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలో మరో సెలబ్రిటీని తెలంగాణ టూరిజానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తామని పేర్కొన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే హారిక నియామకంపై రాష్ట్ర ప్రభుత్వం కానీ, సదరు మంత్రిత్వ శాఖ కానీ ఎటువంటి ఆసక్తి కనబరచట్లేదని స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications