5 రోజులే.. పెండింగ్ చలానాకు సమీపిస్తోన్న గడువు.. దాటితే చర్యలే..

ట్రాఫిక్ చలానా డిస్కౌంట్ గడువు సమీపిస్తోంది. ఈ నెల 31వ తేదీ వరకు ఛాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. అంటే మరో 5 రోజులు మాత్రమే కన్సిషన్ ఉండనుంది. తర్వాత మొత్తం చలానా కట్టాల్సి ఉంటుంది. కరోనా వల్ల ప్రజల ఆదాయం తగ్గిందని.. అందుకే ప్రజలపై భారం పడకూడదనే.. రాయితీని ప్రకటించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌లో చెల్లించే వెసలుబాటును కల్పించారు. గడువులోగా చలాన్లు క్లియర్ చేసుకోవాలని.. లేదంటే జరిమానాల మోత ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

రాయితీ ప్రకటించిన మొదటి నాలుగు రోజులు అనూహ్య స్పందన వచ్చింది. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో గల వాహనదారులు పెండింగ్‌ చలాన్లు క్లియర్‌ చేసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. 650 కోట్ల రూపాయలకు పైగా పెండింగ్‌ చలాన్స్‌ క్లియర్ అయ్యాయి. రాయితీ పోను 190 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి. రోజుకు 7 నుంచి 10 లక్షల చలాన్లు క్లియర్ అవుతున్నాయి. మార్చి 31 వరకే ఈ అవకాశం ఉంటుందని.. తర్వాత గడువు పొడిగించే ఆలోచన లేదని స్పష్టం చేస్తున్నారు.

more 5 days to go for pending challan pay

1500 కోట్ల విలువ చేసే చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి పెండింగ్ చలానా చెల్లించేందుకు అవకాశం కల్పించారు. 31వ తేదీ వరకు అవకాశం ఉంది. బైక్‌లు, కార్లు, లారీలు, ఆటోలపై ఉన్న ఫైన్ల కోసం ఆఫర్ ప్రకటించింది. పెండింగ్‌లో ఉన్న చలాన్లపై ద్విచక్రవాహనదారులు, ఆటోలకు 75శాతం డిస్కౌంట్‌ కల్పించింది. కార్లకు మాత్రం 50 శాతం చెల్లించాల్సి ఉంటుంది. తోపుడు బళ్లకు 25 శాతం చెల్లిస్తే సరిపోతుంది.

నో మాస్క్‌ కేసుల్లో 9 వందల రూపాయల వరకు మాఫీ చేసింది. ఎక్కువగా పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ పెండింగ్‌ చలాన్లపై రాయితీని ప్రకటించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో లక్షా 75 వేల చలానాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+