గులాబీ పార్టీలో మొదలైన మున్సిపల్ టికెట్ల లొల్లి .. టికెట్ కోసం పెట్రోల్ పోసుకున్న టీఆర్ఎస్ నేత
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పంచాయితీ మొదలైంది. ముఖ్యంగా అధికార పార్టీలో పెద్ద ఎత్తున టికెట్ల కోసం పోటీ నెలకొంది. టికెట్ల కోసం ఆశావహులు మంత్రుల, ఎమ్మెల్యేల ఇళ్ళ ముందు క్యూ కడుతున్నారు. ఇక ఇదే సమయంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో తనకు టికెట్ దక్కే అవకాశం లేదని తెలుసుకున్న ఒక టీఆర్ఎస్ నేత , ఆశావహుడు పెట్రోలు పోసుకుని హల్‌చల్ చేసిన ఘటన టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల కోసం ఎంతగా ప్రయత్నాలు జరుగుతున్నాయో అర్ధం అయ్యేలా చెప్తుంది.

గులాబీ పార్టీలో టికెట్ల కోసం మొదలైన పంచాయితీ
సికింద్రాబాద్, బోయిన్‌పల్లిలోని మంత్రి మల్లారెడ్డి కార్యాలయం వద్ద టికెట్ కోసం ఒక ఆశావహుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈమున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్న వారు ఇప్పటికే టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెందిన ఆశావహులు టికెట్ల కోసం పోటీ పడుతున్న పరిస్థితి ఉంది .

మంత్రి మల్లారెడ్డి ఇంటి ముందు టికెట్ రాదనీ తెలిసి ఆత్మహత్యాయత్నం చేసిన ఆశావహుడు
ఇక వీరంతా పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కోసం మంత్రి మల్లారెడ్డిని కలిసేందుకు బోయిన్‌పల్లిలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అప్పటికే మంత్రి తన కార్యాలయంలో టికెట్లు ఇచ్చే విషయంలో చర్చలు జరుపుతున్నారు. అంతలోనే ఓ వ్యక్తి తనకు టికెట్ వచ్చే అవకాశం లేదని తెలుసుకుని మనస్తాపానికి గురయ్యాడు. ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు . అక్కడ వున్నా వారు అతన్ని ఆపి ఆత్మహత్యా యత్నం నుండి విరమింపజేశారు. దీంతో మంత్రి ఇంటి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

అందరికీ న్యాయం చేస్తామన్న మంత్రి .. తలనొప్పిగా టికెట్ల లొల్లి
దీంతో ఘర్షణ పెద్ద ఎత్తున జరిగే అవకాశంఉందని భావించిన మంత్రి మల్లారెడ్డి తన ఇంటి వెనక నుంచి వెళ్లిపోయి మల్లారెడ్డి గార్డెన్స్‌కు చేరుకున్నారు. కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుని మంత్రి పిలుపు కోసం వేచి చూశారు. దీంతో ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడిన మల్లారెడ్డి.. అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఈ సారి మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల లొల్లి తెలంగాణా మంత్రులకు, టీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు పెద్ద తలనొప్పి తెచ్చి పెట్టేలా ఉంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications