హైదరాబాద్ రోడ్లపై నగ్నంగా బైక్ నడుపుతున్న యువకుడు... షాక్ తింటున్న వాహనదారులు

హైదరాబాద్‌ రోడ్లపై ఓ యువకుడు నగ్నంగా బైక్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డుపై వెళ్లేవారిని షాక్‌కి గురిచేస్తున్నాడు. మంగళవారం(మార్చి 9) తిరుమలగిరి మిలటరీ ప్రాంతంలోని ఈఎంఈ వద్ద అతను నగ్నంగా పల్సర్ బైక్‌ డ్రైవ్ చేస్తూ కనిపించాడు. కొంతమంది వాహనదారులు అతన్ని వారించే ప్రయత్నం చేసినా రయ్యిమంటూ బైక్‌పై దూసుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదే యువకుడు రెండు రోజుల క్రితం మారేడ్‌పల్లి-నేరెడ్‌మెట్ మార్గంలోనూ నగ్నంగా బైక్‌పై వెళ్లినట్లు స్థానికులు చెప్తున్నారు. ఆ యువకుడు లంగర్ హౌస్ ప్రాంతానికి చెందినవాడని... మతిస్థిమితం కోల్పోవడం వల్లే అలా నగ్నంగా తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. లంగర్ హౌస్ ప్రాంతంలో బైక్‌ను చోరీ చేసిన అతను... అదే బైక్‌పై లంగర్ హౌస్ నుంచి తిరుమలగిరికి వచ్చినట్లు తెలిపారు. అక్కడినుంచి సనత్ నగర్ వైపు వెళ్లిన అతను... ఓచోట బైక్ వదిలి పారిపోయినట్లు చెప్పారు.

naked man riding bike in hyderabad video gone viral

మతిస్థిమితం లేక నగ్నంగా రోడ్లపై తిరిగేవారు చాలామందే ఉంటారు. అయితే ఈ యువకుడు ఇలా నగ్నంగా బైక్ నడపడం మాత్రం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోలీసులు కూడా ఆ వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు.

naked man riding bike in hyderabad video gone viral

గత జనవరి నెలలో హైదరాబాద్‌లోని రహమత్ నగర్ పోలీస్ అవుట్ పోస్ట్ వద్ద కూడా ఓ యువతి నగ్నంగా హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. తనకు తానే దుస్తులు చించేసుకుని గట్టిగా కేకలు వేస్తూ హంగామా సృష్టించింది. స్థానిక మహిళల సాయంతో పోలీసులు ఆమెకు దుస్తులు అందించి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. మద్యం మత్తులోనే ఆ యువతి అలా ప్రవర్తించినట్లు గుర్తించారు. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+