Zoo Park: నెహ్రూ జూలాజికల్ పార్క్ కు మూడో ర్యాంక్..!
దేశంలో హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ మూడో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఆసియాటిక్ సింహాలు, రాయల్ బెంగాల్ టైగర్లు, తెల్ల పులులు, ఒక కొమ్ము ఖడ్గమృగం వంటి అంతరించిపోతున్న జాతుల విజయవంతమైన సంతానోత్పత్తి కార్యక్రమాలకు జూ పార్క్ పేరు గాంచింది. అలాగే ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్, మొబైల్ యాప్, సోషల్ మీడియాలో యాక్టివ్ ఎంగేజ్‌మెంట్ వంటి ఆధునిక సాంకేతికతలను నెహ్రూ జూలాజికల్ పార్క్ అవలంబించిందని జూ పార్కు డైరెక్టర్ (ఎఫ్‌ఎసి) డాక్టర్ హిరేమత్ చెప్పారు.
అందుకే జూ పార్క్ కు 3వ ర్యాంక్ వచ్చిందని చెప్పారు. కాగా నెహ్రూ జూలాజికల్ పార్క్ 61వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
హైదరాబాద్ జూ పార్క్‌లోని జంతువుల ఆరోగ్యం కాపాడడంలో సిబ్బంది నిబద్ధత కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. జూ పార్కులో 20 వేల లీటర్ల రివర్స్ ఆస్మాసిస్ వాటర్ యూనిట్ నిర్మాణానికి బోల్లారంలోని గ్లాండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ మేనేజింగ్ ట్రస్టీ కెప్టెన్ రఘురామన్ రూ. 25 లక్షల చెక్కును డాక్టర్ హిరేమత్‌కు ఇచ్చారు.

70వ వన్యప్రాణుల వారోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 2న తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, నెహ్రూ జూ పార్క్ సహకారంతో 'క్లౌడ్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్'ను కొనసాగుతోంది. అక్టోబర్ 2 నుంచి అక్టోబరు 8 వరకు జరిగే ఈ ప్రదర్శనలో సింహాలు, కోతులు, ఏనుగులతో సహా జంతువులను పోలి ఉండే అద్భుతమైన క్లౌడ్ చిత్రాలను ప్రదర్శించారు. హైదరాబాద్ జూ పార్క్‌లోని ప్రదర్శన ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రతి సోమవారం సెలవు ఉంటుంది.












Click it and Unblock the Notifications