మెగా డాటర్ నీహారిక వెడ్డింగ్‌కు ఈ ఒక్క టాలీవుడ్ హీరోకే ప్రత్యేక ఆహ్వానం..?

హైదరాబాదు: మెగా ఫ్యామిలీలో మెగా డాటర్ నీహారిక వెడ్డింగ్‌ కోసం సర్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లలో మెగా బ్రదర్ నాగబాబు కుటుంబంతో పాటు చిరంజీవి కుటుంబం, అల్లువారి ఫ్యామిలీ అంతా బిజీగా ఉన్నారు. ఇక ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో మరింత బిజీగా మారిపోయింది మెగా ఫ్యామిలీ. డిసెంబర్ 9వ తేదీన నీహారికా చైతన్యల వివాహం వేడుక రాజస్థాన్‌లో గ్రాండ్‌గా జరగనుంది. ఇందుకోసం ఓబెరాయ్ ఉదయ్ విలాస్ ప్యాలెస్‌ను బుక్ చేసినట్లుగా కూడా కొద్దిరోజుల క్రితం నాగబాబు చెప్పారు. ఇక కరోనా కారణంగా ఈ వివాహానికి హాజరయ్యే అతిథులు చాలా పరిమితి సంఖ్యలో ఉన్నట్లు సమాచారం. మెగా ఫ్యామిలీ కూడా తమ కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులను మాత్రమే వేడుకకు ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. తాజాగా ఓ టాలీవుడ్ హీరోను ఆహ్వానించే యోచనలో నాగబాబు కుటుంబం ఉందట. ఇంతకీ ఎవరా హీరో..?

 పరిమితి సంఖ్యలో అతిథులు

పరిమితి సంఖ్యలో అతిథులు

నీహారిక చైతన్యల మ్యారేజ్‌ను గ్రాండ్‌గా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది నాగబాబు ఫ్యామిలీ. డిసెంబర్ 9 సాయంత్రం 7:15 గంటలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే ఈ వేడుకకు అతిథులు మాత్రం చాలా పరిమితి సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా అతిథులను పరిమితి సంఖ్యలోనే ఆహ్వానించాలని నాగబాబు కుటుంబం భావిస్తోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్లను కూడా ఆహ్వానించడం లేదని సమాచారం. టాలీవుడ్‌లో చాలామంది హీరోలు, సెలబ్రిటీలు మెగా కాంపౌండ్‌లోనే ఉన్నారు. వీరిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాంచరణ్, వరుణ్ తేజ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్‌లు ఉన్నారు.

 వరుణ్ తేజ్‌కు నితిన్ ప్రాణ స్నేహితుడు

వరుణ్ తేజ్‌కు నితిన్ ప్రాణ స్నేహితుడు

కరోనావైరస్ కారణంగా అతిథుల జాబితాను లిమిట్ చేయాలని మెగా ఫ్యామిలి భావిస్తున్నప్పటికీ కొందరిని మాత్రం తప్పక ఆహ్వానించాలన్న పరిస్థితి ఏర్పడింది. నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్‌ తనకు ఇండస్ట్రీలో బెస్ట్‌ ఫ్రెండ్‌గా ఉన్న మరో హీరో నితిన్‌ను వివాహ వేడుకకు ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నితిన్‌ వరుణ్ తేజ్ మంచి ఫ్రెండ్స్ కావడంతో టాలీవుడ్‌లో మిగతా హీరోల సంగతి ఎలా ఉన్నా... నితిన్‌ను మాత్రం వెడ్డింగ్‌కు ఇన్వైట్ చేయాలని పట్టుబడుతున్నాడట వరుణ్. అయితే ఇక మెగా ఫ్యామిలీ హీరోస్‌తో పాటు ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో నితిన్ మాత్రమే ప్రత్యేక అతిథిగా ఉండొచ్చనే టాక్ ఫిలింనగర్‌లో వినిపిస్తోంది.

 పెళ్లి పనుల్లో బిజీ అయిపోయిన మెగా ఫ్యామిలీ

పెళ్లి పనుల్లో బిజీ అయిపోయిన మెగా ఫ్యామిలీ

ఇదిలా ఉంటే నిహారికా చైతన్యలు వెడ్డింగ్‌ మూడ్‌లోకి వెళ్లిపోయారు. నిహారికా ఈ మధ్యనే గోవాలో తన స్నేహితులకు పార్టీ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు షాపింగ్ చేస్తూ కూడా చాలా హడావుడిగా కనిపిస్తోంది. కొద్ది రోజులు క్రితం చైతన్యను కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. నీహారిక కాబోయే భర్త హైదరాబాదులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ మధ్య ఇద్దరూ హైదరాబాదులోని ఓ జిమ్‌లో కలిసి వ్యాయామం చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇక కరోనావైరస్ నుంచి కోలుకున్న నాగబాబు కూడా పెళ్లి పనుల్లో బిజీగా మారారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+