నో కర్ఫ్యూ..? తెలంగాణలో లేదు, ఫిబ్రవరి 1నుంచి స్కూళ్లు స్టార్ట్.. మార్కెట్
కరోనా కేసులు పెరుగుతున్న.. రికవరీ రేటు కూడా అదేస్థాయిలో ఉంది. దీంతో ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. కరోనా కేసుల నేపథ్యంలో కర్ఫ్యూ, స్కూళ్ల సెలవుల పొడగింపు.. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్కూల్స్ పున: ప్రారంభం.. కర్ఫ్యూ విధిస్తే మార్కెట్‌పై ప్రభావం తదిరత అంశాల గురించి డిస్కష్ చేస్తోంది.
రాష్ట్రంలో కరోనా కేసులు.. ప్రస్తుత పరిస్థితిని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు.. సమావేశంలో వివరించారు. ఎలాంటి పరిస్థితిని అయిన ఎదుర్కొంటామని చెప్పారు. దీంతో కర్ఫ్యూ విధించడానికి మంత్రివర్గం సానుకూలంగా లేదు. కరోనాను స్వీయ నియంత్రణతోనే తరిమి కొట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదివరకు సీఎం కేసీఆర్ పదే పదే.. చెప్పేవారు. మనం పరిశుభ్రంగా.. పరిసరాలు నీట్‌గా ఉంటే.. ఏ రోగం రాదని చెప్పారు. దానిని మరోసారి చెప్పే ఛాన్స్ ఉంది. మంత్రివర్గ సమావేశం తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడతారు.

ఫిబ్రవరి 1వ తేదీ వరకు కేసులు తగ్గుముఖం పడతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో అప్పుడు స్కూల్స్ స్టార్ట్ చేయాలని ప్రభుత్వం అనుకుంటుంది. ముఖ్యంగా 15 ఏళ్ల లోపు పిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడం లేదు. సో వారికి అందుకే సెలవులను పొడగించారు. మిగతా వారికి వ్యాక్సినేషన్ జరుగుతున్నందున తప్పడం లేదు. వ్యాక్సినేషన్ పూర్తయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
కర్ఫ్యూ విధిస్తే.. మార్కెట్‌పై ప్రభావం చూపిస్తోంది. ఇప్పుడిప్పుడే మార్కెట్ కోలుకుంటుంది. మళ్లీ ఆంక్షలు విధిస్తే.. అన్నీ వర్గాలు దెబ్బతింటాయని భావిస్తున్నారు. అందుకే ఆంక్షలు విధించే విషయంపై ఆచి తూచి నిర్ణయం తీసుకోనుంది. కడపటి సమాచారం మేరకు.. రాష్ట్రంలో కర్ఫ్యూ విధించే అవకాశం లేదని తెలుస్తోంది. కానీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.