ఎన్ని లేఖలు రాసినా ఉలుకూ పలుకూ లేదు .. కేంద్రం సహకరించటం లేదు : కేటీఆర్ ఫైర్
తెలంగాణా శాసన మండలి సాక్షిగా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త రోడ్లను ఆలోచన చేస్తోందని, కానీ కేంద్ర ప్రభుత్వం ఉన్న రోడ్లను మూసేస్తుంది అని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో రహదారుల అభివృద్ధికి నాలుగు రకాల ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ రోడ్ల విషయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మండలిలో మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు.
హైదరాబాద్ ను విశ్వనగరం గా మార్చడం కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడానికి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు కేటీఆర్. నగరంలో కొత్త రోడ్లను వేసేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రయత్నిస్తుంటే కేంద్ర సహకారం అసలే లేదని ఆయన ఆరోపించారు. రక్షణ రంగానికి చెందిన కంటోన్మెంట్ స్థలాలను రాష్ట్రానికి ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ కంటోన్మెంట్లో రోడ్ల మూసివేత అంశం గురించి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఇప్పటికి పది సార్లు లేఖలు రాశామని చెప్పుకొచ్చారు కేటీఆర్. ఆయన కేంద్రం తీరు ఉలుకు పలుకు లేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

కరోనా లాక్డౌన్ సమయంలో రాష్ట్రంలో రోడ్ల పనులు చేయాలని భావిస్తే కేంద్రం సహకరించక పోవడం వల్ల పనులు ఆగిపోయాయని కేటీఆర్ తెలిపారు. మిస్సింగ్, లింక్ రోడ్లను గుర్తించి అభివృద్ధి చేస్తున్నామని ప్రకటించిన కేటీఆర్, హైదరాబాద్ సమగ్రాభివృద్ధి కోసం, రోడ్లను డెవలప్ చేయడం కోసం టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. బీజేపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు విభజన రాజకీయాలు కాకుండా రాష్ట్రం కోసం ఏమైనా చేస్తే బాగుంటుందని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Recommended Video
-
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications