టీకా వద్దయ్యో.. వెక్కి వెక్కి ఏడ్చిన బామ్మ.. లాలించి వ్యాక్సిన్ వేసిన ఆరోగ్య కార్యకర్తలు

కరోనా వేరియంట్లు భయాందోళన కలిగిస్తోన్నాయి. ఒమిక్రాన్, ఇతర వేరియంట్లను నిలువరించాలంటే.. వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం.. మాస్క్ ధరించి.. ఫిజికల్ డిస్టన్స్ పాటించాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. దేశంలో ఇప్పటికే వ్యాక్సిన్ డోసులు ఆశించిన స్థాయిలో జరుగుతున్నాయి. కానీ కొందరు మారం వేస్తున్నారు. నిన్న జగిత్యాల జిల్లా జగ్గసాగర్‌లో ఓ వృద్దురాలు నానా హంగామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఖమ్మంలో ఓ బామ్మ వంతు వచ్చింది. ఆమె చూడటానికి బామ్మ.. కానీ చిన్న పిల్ల మాదిరిగా ఏడ్చేసింది.

ఇంజెక్షన్ అంటే భయం..

ఇంజెక్షన్ అంటే భయం..

ఇంజెక్షన్ అంటే భయం.. సూదితో గుచ్చేస్తారని భయపడిపోతారు చిన్నపిల్లలు. పెద్దవాళ్లు వాళ్లను సముదాయిస్తారు. డాక్టర్ నొప్పి లేకుండా ఇంజెక్షన్ చేస్తారుగా.. చేయించుకుంటే ఆయి పోతుందమ్మా అని బుజ్జగించి బతిమాలి చేయిస్తారు. చిన్నపిల్లలే కాదు చాలామంది పెద్దవాళ్లకు కూడా ఇంజెక్షన్ అంటే భయపడిపోతారు. ఇంజెక్షన్ వద్దు డాక్టర్.. ట్యాబ్లెట్స్ రాయండి అని అడుగుతారు చిన్నపిల్లల్లాగా.. కొన్ని పరిస్థితుల్లో సూది మందు తప్పనిసరి. కరోనా కాలంలో టీకా కూడా అంతే. తప్పకుండా వేయించుకోవాల్సిందే. ఒక్క క్షణం ఓర్చుకుంటే టీకా వేయించుచేసుకోవచ్చు.

తీసుకో అమ్మ..

తీసుకో అమ్మ..

సూది అంటే భయపడేవారికి, కరోనా వ్యాక్సిన్ వేయటానికి ఆరోగ్య కార్యకర్తలు అచ్చు అమ్మల్లాగానే నచ్చ చెప్పి మరీ వేస్తున్నారు. వ్యాక్సిన్ వద్దు అనేవాళ్లకు ఎలా వివరించి చెప్పి మరీ వేస్తున్నారో.. సూది మందు అంటే భయపడేవారికి కూడా అచ్చు అమ్మ లాగే బుజ్జగించి..బతిమాలి 'నొప్పి లేకుండా వేస్తానుగా..' అని మరీ వేస్తున్నారు. ఈ బామ్మకు కూడా ఓ ఆరోగ్య కార్యకర్త అలాగే కరోనా వ్యాక్సిన్ వేసింది. అచ్చు అమ్మలాగా.. ఖమ్మం జిల్లా చింత‌కాని మండ‌లం‌ నాగి‌లి‌గొండకు చెందిన అరి‌కొట్ల సాభా‌గ్యమ్మ అనే వృద్ధురాలు కరోనా మొదటి డోసు వేయించుకుంది. రెండో డోసు వేయించుకోవాలి. కానీ వేయించుకోవట్లేదు. ఎంతమంది చెప్పినా వినట్లేదు.

 రెండో డోసు కోసం

రెండో డోసు కోసం

శుక్ర‌వారం ఆరోగ్య కార్యక్తలు నాగిలిగొండకు వచ్చారు. సౌభాగ్యమ్మకు కూడా రెండో టీకా వేసు‌కో‌వా‌లని చెప్పారు. దానికి సౌభా‌గ్య‌మ్మ భయం వద్దు అంటూ చిన్నపిల్లలాగా వెక్కివెక్కి ఏడ్చింది. అక్కడే ఉన్న వైద్య‌సి‌బ్బందికి చెందిన ఓ వ్యక్తి చేయి పట్టేసుకుని అచ్చం చిన్నపిల్లలాగా దాక్కుంది. దీంతో ఆమెకు ఆరోగ్య కార్యకర్త నీ ప్రాణం కోసమే కదా అవ్వా.. అంటూ సము‌దా‌యించి..నచ్చ‌జెప్పి వ్యాక్సిన్‌ వేసింది. తర్వాత కూడా ఆమె చిన్నపిల్లలాగా ఏడుస్తునే ఉంది. స్థానికులు ఊరుకో అవ్వా..నువ్వు బాగుండాలనే కదా అంటూ ఓదార్చారు. ఏడుపు మానేదాకా బుజ్జగించారు. సదరు బామ్మ వ్యాక్సిన్ వేయించుకునేటప్పుడు అచ్చు చిన్నపిల్లలాగా అనిపిస్తోంది

ఒమిక్రాన్ వణుకు

ఒమిక్రాన్ వణుకు

ఒమిక్రాన్ వైరస్ టెన్షన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ గడ గడలాడించిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ మూడో వేవ్ అనడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. అయితే వైరస్ నేపథ్యంలో ఒకటికీ రెండుసార్లు తనిఖీ చేయడం సహజమే.. కానీ కొందరు అవమాన పడాల్సి వస్తోంది. ఇటీవల లండన్ నుంచి వచ్చిన హైదరాబాదీ యువతి ఆ నిట్టూర్పు తప్పలేదు. ఇటు ఒమిక్రాన్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తుంది. తీవ్ర ఒళ్ళు నొప్పులు, నీరసం, తలనొప్పి వంటి లక్షణాలు ఓమిక్రాన్ సోకిన వారికి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి ఒమిక్రాన్ వైరస్ సోకుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+