5 రోజులే ఆన్ లైన్ క్లాసులు, 3 నుంచి డిగ్రీ వరకు, టీ శాట్‌లో బోధన

తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు తక్కువగా వస్తున్నాయి. ప్రభుత్వం పలు ఆంక్షలను సడలించింది. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలు తెరవకపోతే బెటర్ అని భావించింది. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు గురువారం నుంచి ప్రారంభం అయ్యాయి.

గత ఏడాది చదివిన ముఖ్యమైన పాఠ్యాంశాలతో బ్రిడ్జికోర్సును విద్యాశాఖ సిద్ధం చేసింది. ఈ నెల మొత్తం విద్యార్థులు బ్రిడ్జి కోర్సునే చదవాల్సి ఉంటుంది. వారానికి ఐదు రోజులు, ఒక్కో పీరియడ్‌ అరగంట ఉంటుంది. మొత్తం 240 పాఠ్యాంశాలను ఆన్ లైన్ లో బోధించేందుకు అధికారులు సిద్ధం చేశారు. 3 నుంచి 5వ తరగతి వరకు లెవల్ -1గా, 6, 7 తరగతులను లెవల్ -2 గా, 8-9 తరగతులను లెవల్ - 3గా, 10వ తరగతి విద్యార్థులను లెవల్ - 4గా విభజించారు.

 online classes conducts only 5 days

డీడీ యాదగిరి, టీశాట్ విద్యా ఛానళ్ల ద్వారా ప్రసారం చేస్తున్నారు. జులై 01 నుంచి 7వ తరగతి వరకు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. టీశాట్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు.. ధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు, అరగంటకు ఒక పీరియడ్‌ ఉంటుంది. డీడీ యాదగిరిలో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠ్యాంశాలను ప్రసారం చేస్తారు.

ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులకు సంగతికి వస్తే.. అరగంటకు పీరియడ్‌ చొప్పున ఉంటుంది. దూరదర్శన్‌లో ఉదయం 8:30 నుంచి 10:30 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బోధిస్తారు. టీశాట్‌ ద్వారా ఒకేషనల్‌ విద్యార్థులకు ఉదయం 7 - 9 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8:30 గంటల వరకు క్లాసులు జరుగుతాయి. డిగ్రీ విద్యార్థులకు జూమ్‌, వెబెక్స్‌, గూగుల్‌ మీట్‌ తదితర యాప్‌ల ద్వారా వర్చువల్‌ ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+