Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాజీ ఎమ్మెల్యే కొడుకు అసభ్యంగా..: నటి సంజన ఫిర్యాదు

హైదరాబాద్: ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ సినీ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పటాన్‌చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్‌ కుమారుడు ఆశిష్‌పై శనివారం రాత్రి ఆమె ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

శనివారం రాత్రి పబ్‌లో మద్యం మత్తులో ఉన్న ఆశిష్ గౌడ్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ ఎస్సై వెంకటరెడ్డి తెలిపారు. ఆశిష్ గౌడ్ ఎక్కువ మోతాదులో మద్యం సేవించి పబ్బులో అమ్మాయిలను చితకబాది అడ్డువచ్చిన వారిపై చేయి చేసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొందని చెప్పారు.

తనకు ఆ అమ్మాయి తెలియదంటూ ఆశిష్

కాగా, తనపై వచ్చిన వేధింపుల ఆరోపణలను ఆశిష్ గౌడ్ ఖండించారు. తాను నోవాటెల్‌కు వెళ్లిన మాట వాస్తవమేనని, అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. విచారణలో అన్ని విషయాలు బయటికి వస్తాయని తెలిపారు. తనపై ఫిర్యాదు చేసిన అమ్మాయి ఎవరో తనకు తెలియదని చెప్పారు.

patancheru ex mla son ashish goud misbehaved with me: actress sanjana.

మాదాపూర్‌ హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో శనివారం రాత్రి ఆశిష్ బీభత్సం సృష్టించాడని సంజన తన పిర్యాదులో పేర్కొన్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే గాక, అభ్యంతరకరమైన పదజాలంతో దూషించాడని ఆమె ఈ మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై ఫిర్యాదు చేసింది.

తన స్నేహితులతో కలిసి వచ్చి నోటికివచ్చిన బూతులు తిట్టాడని తెలిపారు. మద్యం మత్తులు నానా హంగామా చేశాడని, వెకిలి వేషాలు వేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. సంజన ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరుపుతున్నారు.

సేహితుడి కుమార్తెపై అత్యాచారయత్నం

స్నేహితుడు కుమార్తె అనే ఆలోచన కూడా లేకుండా ఓ కామాంధుడు ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన నగరంలోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్‌గూడకు చెందిన వహీద్(43) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. మోతీ మార్కెట్లో నివాసం ఉండే స్నేహితుడి ఇంటికి ఇతడు తరచూ వెళ్తుంటాడు.

ఈ క్రమంలో శనివారం వహీద్ స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న స్నేహితుడి 17ఏళ్ల కుమార్తెపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె గట్టిగా అరవడంతో పారిపోయాడు. ఈ విషయం తండ్రికి తెలపడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడ్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+