Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా పట్టుబడిన బంగారం..
ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎన్నిసార్లు పట్టుబడినా బంగారం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా బంగారం, ఫారిన్ కరెన్సీని అక్రమంగా తరలిస్తున్న నలుగురు ప్రయాణికులను శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం దుబాయ్, కువైట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ముగ్గురు వేర్వేరు ప్రయాణికులు బంగారాన్ని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వారి లాగేజీ తనిఖీ చేయగా.. ముగ్గురి నుంచి 1,657 గ్రాముల బంగారం లభిచింది. బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ బంగారం విలువ దాదాపు రూ.99 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. బహ్రెయిన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఓ ప్యాసింజర్ ఫారిన్ కరెన్సీని తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. రూ.13 లక్షల విలువైన ఫారిన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా ఒక్క బంగారం, ఫారిన్ కరెన్సీ కాదు.. డ్రగ్స్ ను కూడా స్మగ్లింగ్ చేస్తునన్నారు. కొద్ది రోజుల క్రితం శంషాబాద్ ఎయిర్ పోర్టులో సింగపూర్, ఢిల్లీ నుంచి డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను అధికారులు పట్టుకున్నారు.

ఓ వ్యక్తి డ్రగ్స్ ను నాలుగు మహిళా హ్యాండ్ బ్యాగుల్లో బ్రౌన్ టేప్‌తో చుట్టి చెక్ ఇన్ సూట్‌కేసు అడుగు భాగంలో ఉంచాడు. ఆ ప్రయాణికుడు లావోస్ నుంచి సింగపూర్, హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్తున్నాడు. అధికారులకు పక్కా సమాచారం రావడంతో ప్రయాణికుడిపై నిఘా పెట్టారు. నిందితుడి దగ్గర భారీ స్థాయిలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రూ.50 కోట్ల విలువైన 5 కిలోల కొకైన్ ను అధికారులు పట్టుకున్నారు. ఎంత మంది పట్టుబడినా.. నిందితులు మాత్రం డ్రగ్స్, బంగారం.. తదితర వాటిని తరలించడం మాత్రం ఆపడం లేదు.
అంతకు ముందు లోదుస్తుల్లో దాచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని శంషాబాద్ ఎయిర్ పోర్టు కస్టమ్స్ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇండిగో విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 785 గ్రాముల అక్రమ బంగారాన్ని గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అధికారులు ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు. మార్కెట్లో ఈ బంగారం విలువ రూ.47.49లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు.
-
Gold: భారీగా పెరిగిన బంగారం ధరలు. పసిడి మార్కెట్లో పూనకాలు -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications