Petrol Pumps: హైదరాబాదు పెట్రోల్ బంకుల్లో కస్టమర్ల ఇబ్బందులు..ఎందుకంటే..?

హైదరాబాద్: దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణిని ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. గందరగోళానికి దారి తీస్తోంది. ఈ నోటు వాడకంలోనే ఉందని, రద్దు కాలేదంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినప్పటికీ- దీన్ని స్వీకరించడానికి వ్యాపార సంస్థలు పెద్దగా ముందుకు రావట్లేదు. వాటిని తీసుకోవడానికి ఆసక్తి చూపట్లేదు. ప్రత్యేకించి పెట్రోల్ బంకుల్లో వాహనదారులు ఇక్కట్లకు గురవుతున్నారు.

దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణిని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆ నోట్లను బ్యాంకుల్లో మార్పిడి, డిపాజిట్ చేసుకోవడానికి వీలు కల్పించింది. ఏ బ్యాంకులోనైనా 2,000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చని, చలామణిలోనే ఉన్నాయని స్పష్టం చేసింది.

Petrol pump workers not accepting Rs 2000 notes despite RBI orders

కొన్ని వ్యాపార సంస్థలు ఈ నోట్లను తీసుకోవడానికి నిరాకరిస్తోండటం గందరగోళానికి దారి తీసింది. రూ.2,000 నోటు రద్దయిందని, అది చెల్లదంటూ స్పష్టం చేస్తోన్నాయి. రిజర్వ్ బ్యాంక్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ- వారు పట్టించుకోవట్లేదు. దీనితో కొనుగోలుదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. పెద్ద నోట్ల మార్పిడి కోసం బ్యాంక్‌ దాకా వెళ్లాల్సిన ఇబ్బంది తప్పుతుందనే కారణంతో వాటిని రోజువారీ కార్యకలాపాల కోసం వినియోగిస్తోన్నారు.

ప్రత్యేకించి- పెట్రోల్ బంకుల్లో 2,000 డినామినేషన్ నోట్లను తీసుకోవడానికి అక్కడి సిబ్బంది ఏ మాత్రం అంగీకరించట్లేదు. ట్యాంక్ ఫుల్ చేసుకున్నా గానీ తమ వద్ద చిల్లర లేదంటూ ముఖం మీదే తేల్చి చెబుతున్నారు. పెద్ద నోట్లను తీసుకోమని స్పష్టం చేస్తోన్నారు. పెట్రోల్ బంకుల్లో తాము ఎదుర్కొన్న అనుభవాలను వాహనదారులు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోన్నారు. వాటిని రిజర్వ్ బ్యాంక్‌కు ట్యాగ్ చేస్తోన్నారు.

హైదరాబాద్‌లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్‌లో 2,000 నోట్లను తీసుకోవడానికి సిబ్బంది అంగీకరించట్లేదంటూ ఓ ట్విట్టరెటీ చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ ప్లాట్‌ఫామ్‌ మీద పోస్ట్ చేశారు. 2,000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ రద్దు చేసిందని, వాటిని తాము తీసుకోవట్లేదని స్పష్టం చేయడం, బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటూ సూచించడం ఈ వీడియోల్లో చూడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+