Sri reddy: అబ్బా.. ఎప్పుడూ వీడి మూతేనా.. మార్చండిరా.. లిస్ట్ చెప్పండంటూ..
శ్రీ రెడ్డి.. ఎప్పుడూ ఎదో అంశం గురించి పోస్టులు పెడుతుంటారు. వాటికి నెటిజన్లు కూడా రిప్లై ఇస్తుంటారు. అలా రఘురామ కృష్ణ రాజు వ్యవహారంలో కూడా శ్రీ రెడ్డి తలదూర్చారు. అసలే రఘురామ కూడా ఫైర్ బ్రాండే.. ఆయనకు ఫ్యాన్స్ కొకొల్లలు.. ఇంకేముంది దీనిపై అభిమానులు రియాక్ట్ అయ్యారు. శ్రీ రెడ్డి గత చరిత్రలో ఓ ఫోటో తీసి పోస్ట్ చేశారు. దీనికి కూడా శ్రీ రెడ్డి తనలాగే సమాధానం ఇచ్చారు. ఎప్పుడూ ఈ ఫోటోనా.. ఈ మూతియేనా.. వేరే ఫోటో పెట్టండిరా అంటూ తనదైన శైలిలో స్పందించారు. దీనికి నెటిజన్లు కూడా అదే రేంజ్‌లో ఆన్సర్ ఇస్తున్నారు.

రఘురామపై పంచులు..
ఇటీవల శ్రీరెడ్డి వైసీపీకి అనుకూలంగా వరుస పోస్ట్‌లు షేర్ చేస్తున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజుని ఓ రేంజ్‌లో ఆడుకుంటూ వరుస పోస్ట్‌లు చేస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ ఉద్దేశిస్తూ ఓ పోస్ట్ పెట్టగా.. ఆమె హేటర్స్ కొంతమంది ఎప్పటిలాగే ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఓ నెటిజన్ శ్రీరెడ్డి-అభిరామ్‌ల లిప్ లాక్ రొమాన్స్ ఫొటోని షేర్ చేశాడు.
దీనిపై తనదైన శైలిలో స్పందించింది శ్రీరెడ్డి.. ఇంకెంతసేపూ వీడి మూతేనా?? ఇంకెవడి మూతి అయినా పెట్టి మీమ్స్ చేయండ్రా? అంటూ కౌంటర్ ఇచ్చింది. అయితే తప్పకుండా పెడతాం.. నీ లిస్ట్‌లో ఉన్న ఫొటోలు వదిలితే అంతకంటేనా? అంటూ కౌంటర్లు ఇస్తున్నారు నెటిజన్లు.

అభిరామ్‌తో రొమాన్స్
దగ్గుబాటి సురేష్ బాబు కొడుకుతో సాగించిన రాసలీలల ఫొటోలను లీక్ చేసి టాలీవుడ్‌ని షేక్ చేసింది శ్రీరెడ్డి. ఆ తరువాత నుంచి ఒక్కొక్కటిగా వరుస పోస్ట్‌లను షేర్ చేస్తూ దగ్గుబాటి వారసుడి పరువుని రోడ్డుపైకి లాగింది. అభిరామ్-శ్రీరెడ్డి లిప్ లాక్ చేస్తూ ఉన్న బెడ్ రూం ఫొటో అప్పట్లో పెద్ద సంచలనం అయ్యింది. అయితే వీరిద్దరి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ కూడా ఆ ఫొటో తెరపైకి రావడంతో దీనిపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యింది శ్రీరెడ్డి. మూతి మార్చండి అంటూ స్పందించారు. దానికి అదే స్థాయిలో నెటిజన్లు కూడా రిప్లై ఇచ్చారు.

శ్రీ రెడ్డి అంటే షేక్ చేయడమే..?
ఇప్పుడే కాదు చాలా సందర్భాల్లో శ్రీ రెడ్డి ఇలాగే కౌంటర్లు ఇస్తారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, అల్లు ఫ్యామిలీ, ఎన్టీఆర్‌పై కూడా కామెంట్స్ చేశారు. అభిరామ్ గురించి అయితే సందర్భం దొరికితే చాలు.. కామెంట్ చేస్తుంటారు. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా పోస్టులు చేయడం.. ఒక ఎత్తయితే.. రఘురామకు వ్యతిరేకంగా శ్రీ రెడ్డి పోస్టులు పెట్టారు. దీంతో విషయం పెద్దది అయిపోయింది.












Click it and Unblock the Notifications