Hyderabad: కూకట్ పల్లిలో వ్యభిచారం చేస్తున్న 31 మంది అరెస్ట్..!

హైదరాబాద్ లో వ్యభిచారం చేసే వారు పెరిగిపోతున్నారు. ముఖ్యంగా కూకట్ పల్లి, కేపీహెచ్బీ ప్రాంతాల్లో రాత్రి 9 నుంచి మెట్రో స్టేషన్ల వద్ద, రోడ్డు పక్కన వారే ఉంటున్నారు. దీంతో అటు వైపు వెళ్లే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతాల్లో వ్యభిచారం చేసే మహిళలు పెరిగిపోయారని పలు వార్త కథనాలు కూడా వచ్చాయి. అంతే కాకుండా కొద్ది రోజుల క్రితం ఓ వ్యభిచారిని మరో వ్యభిచారిని హత్య చేసింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

దీంతో పోలీసులు ఈ ప్రాంతాల్లో నిఘా పెట్టారు. తాజాగావ్యభిచారం చేస్తున్నారనే ఆరోపణలపై 31 మంది మహిళలు, నలుగురు ట్రాన్స్ జెండర్లను మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU), షీ టీమ్స్, స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని గురువారం రాత్రి కూకట్‌పల్లిలోని KPHB మెట్రో స్టేషన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తులను కూకట్‌పల్లి తహశీల్దార్ ముందు బైండ్-ఓవర్ (ఒక వ్యక్తి నిర్ణీత వ్యవధి వరకు సక్రమంగా ప్రవర్తించాల్సిన కోర్టు ఉత్తర్వు) పొందేందుకు హాజరుపరిచారు.

Police arrested 31 women accused of prostitution in Hyderabad s Kukatpally

అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం, 1956 కింద కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో నాలుగు కేసులు, కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. అక్టోబర్ మొదటి వారంలో ఇదే ప్రాంతంలో 22 మందిని అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లి మండల రెవెన్యూ అధికారి (MRO) వారికి సత్ప్రవర్తన నోటీసులు జారీ చేసిన తర్వాత విడిచిపెట్టారు. వ్యభిచారం, సంబంధిత కార్యకలాపాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని సైబరాబాద్ పోలీసులు చెప్పారు.

అరెస్ట్ అయిన తర్వాత కొద్ది రోజులు సైలెంట్ గా ఉంటారని ఆ తర్వాత మళ్లీ ప్రారంభిస్తారని చెప్పి స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో ఎప్పుడు నిఘా పెట్టాలని కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+