హైదరాబాద్‌లో దారణం: ప్లాస్టిక్ కవర్‌లో మొండెం లేని మహిళ తల లభ్యం, ఎవరిది?
హైదరాబాద్: నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మలక్‌పేట తీగలగూడ వద్ద మొండెం లేని మహిళ తల కనిపించడం స్థానికంగా భయభ్రాంతులకు గురిచేసింది. మహిళ తలను గమనించిన స్థానికులు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళితే.. మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తీగలగూడ మూసీ నది ఒడ్డున ఓ మహిళ తల కనిపించింది. ఓ ప్లాస్టిక్ కవర్ లో ఉన్న తలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొండెం లేని తలను ఎవరో తీసుకొచ్చి ఇక్కడ పడేసినట్లు చెబుతున్నారు. మొండెం ఎక్కడ ఉందో విచారణ చేపట్టారు పోలీసులు. ఎక్కడో హత్య చేసి.. తలను కోసి.. మూసీ నదిలో పడేసిట్లు అనుమానిస్తున్నారు. తలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

మొండెం కోసం గాలింపు మొదలుపెట్టారు. విషయం తెలిసిన వెంటనే పోలీస్ టీమ్స్ స్పాట్‌కు చేరుకున్నాయి. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. అడిషనల్ డీసీపీ ఆనంద్ స్పాట్‌కు వచ్చి విచారణ చేస్తున్నారు. ఈ మహిళ ఎవరు.. ఏ ప్రాంతానికి చెందిన వారు.. హత్య చేయటానికి కారణాలు ఏంటీ.. చేసింది ఎవరు..? ఎప్పుడు, ఎక్కడ హత్య జరిగింది? అనే విషయాలపై విచారణ చేస్తున్నారు. తల ఆధారంగా మహిళ ఎవరు అనేది గుర్తించటానికి ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేశారు పోలీసులు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కాగా, గతంలో కూడా ఇలాంటి ఘటనే నగరంలో చోటు చేసుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ 12న హైద్రాబాద్‌కు సమీపంలోని తుక్కుగూడ సమీపంలో మహిళ డెడ్ బాడీ లభ్యమైంది. మహిళపై అత్యాచారం చేసి ఆమెను హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ప్లాస్టిక్ బ్యాగులో మహిళ డెడ్ బాడీని నిందితులు వదిలివెళ్లారు. తాజాగా, ఈ ఘటన చోటు చేసుకోవడంతో నగర ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications