ఆధ్యాత్మిక కేంద్రంగా ముచ్చింతల్, రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాం ఆవిష్కరించిన రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమతామూర్తి రామానుజులచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు హెలికాప్టర్ ద్వారా సమతామూర్తి విగ్రహాన్ని తిలకించారు. ప్రాంగణానికి రాష్ట్రపతి దంపతులకు.. చినజీయర్ స్వామి ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత ప్రత్యక్షంగా 216 అడుగుల రామానుజాచార్యుల విగ్రహాన్ని సందర్శించారు. దివ్యక్షేత్రంలో గల 108 వైష్ణవ ఆలయాలకు దర్శించుకున్నారు. తర్వాత భద్రవేదిలో మొదటి అంతస్తులో ఉన్న 120 కిలోల స్వర్ణమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్ తమిళి సై సౌందరరాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.

ఆధ్యాత్మిక కేంద్రంగా..
ఇక ముచ్చింతల్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లనుందని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. రామానుజుల స్వర్ణమూర్తి విగ్రహాన్ని నెలకొల్పి చినజీయర్‌స్వామి చరిత్ర లిఖించారన్నారు. రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలిపారు. సమతామూర్తి విగ్రహాన్ని లోకార్పణం చేయడం సంతోషంగా ఉందన్నారు. సమతాస్ఫూర్తి కేంద్రంలో 108 దివ్యక్షేత్రాలకు ప్రాణప్రతిష్ఠ జరిగిందన్నారు. శ్రీరామనగరం అద్వైత, సమతా క్షేత్రంగా విరాజిల్లుతుందని వివరించారు. దేశంలో పలు ప్రాంతాల్లో తన సందేశాలతో చైతన్యం నింపారన్నారు. బడుగు వర్గాలకు దైవ దర్శనం ప్రాప్తి కోసం కృషి చేశారని చెప్పారు. ఈశ్వర ఆరాధన చేసేందుకు అన్ని వర్గాలకు హక్కు ఉంటుందని చెప్పారన్నారు.

భక్తితోనే ముక్తి
దైవభక్తి ద్వారా ప్రజలకు ముక్తి లభిస్తుందని చాటి చెప్పారని, సాంస్కృతిక విలువల ఆధ ఆరంగా ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారన్నారు. అంతకు ముందు చినజీయర్‌స్వామి మాట్లాడారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతికి సాదర స్వాగతం పలికారు. సమతా సిద్ధంతాలను రామానుజులు ప్రపంచవ్యాప్తం చేశారన్నారు. అన్ని వర్గాలు సమానమే అని రామానుజులు చాటి చెప్పారని, భగవంతుడి ఆరాధనకు అన్ని వర్గాలు అర్హులేనని చెప్పారని, సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమాపారని తెలిపారు.
Recommended Video

గ్రాండ్ వెల్ కం
అంతకుముందు బేగంపేట ఎయిర్ పోర్టులో రాష్ట్రపతి దంపతులకు సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై స్వాగతం పలికారు. అక్కడినుంచి రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో సహస్రాబ్ది ఉత్సవాలకు బయల్దేరారు. రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా భద్రవేది మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన 120 కిలోల రామానుజచార్యుల బంగారు విగ్రహం ఆవిష్కృతమయ్యింది. రేపు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మహా పూర్ణాహుతితో పాటు భగవత్ రామానుజుల స్వర్ణమూర్తికి ప్రాణ ప్రతిష్ట, కుంభాబిషేకం నిర్వహిస్తామని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామిజీ తెలిపారు. రేపు సాయంత్రం 108 దివ్యదేశాల దేవతలకు శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు.