పైకి హోటల్.. లోన వ్యభిచారం... గుట్టు రట్టు
గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో ఓ హోటల్ వ్యభిచారం జరుగుతోంది. పైకి హోటల్ లాగా కనిపిస్తోన్న లోన వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో ముఠా గుట్టును మాదాపూర్ ఎస్‌ఓటీ, గచ్చిబౌలి పోలీసులు రట్టు చేశారు. వ్యభిచార గృహంపై దాడిచేసి విటులతోపాటు నిర్వాహకులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రధాన నిందితులు, నిర్వాహకులు ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
అదుపులో తీసుకున్న వారి నుంచి రూ.32,510, ఐదు ఫోన్లు, 53 కండోమ్స్ ప్యాకెట్లు, హోటల్ రిజిస్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ శ్రీరాంనగర్‌లోని ప్లాట్‌నెంబర్ 216-బీ, ఒడిశాకు చెందిన ప్రభాకర్, అజయ్, సంజయ్ రాయల్ డీలక్స్ పేరుతో హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహం నడుపుతున్నారు.

విశ్వస నీయ సమాచారం మేరకు పోలీసులు మూడు రోజులుగా నిఘా పెట్టి ఐదుగురు విటులు, ఆరుగురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. బిజు, దీపక్‌కుమార్, కిషోర్‌దాల్, నిథిన్‌జోషి, బండి నారాయణ, తోట వెంకటేష్‌తోపాటు ఆరుగురు యువతులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. నిర్వాహకులు ప్రభాకర్, అజయ్, సంజయ్ పరారీలో ఉన్నారు.












Click it and Unblock the Notifications