సైకో సాయి.. స్నానం చేస్తుండగా వీడియో.. నగ్నంగా మాట్లాడాలని బలవంతం..
వెర్రి తనమో.. కామమో తెలియడం లేదు. కొందరు మరీ సైకోల్లా బీహెవ్ చేస్తున్నారు. అవును ఆడది కనిపిస్తే చాలు.. అనుభవించాలని అనుకుంటున్నారు. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా.. ప్రవర్తన మాత్రం మారడం లేదు. ఇలాంటి ఘటనలకు పట్టణం, పల్లెటూరు అనే తేడా లేకుండా పోయింది. కొందరీ ప్రవర్తన మహిళలకు శరఘాతంగా మారుతుంది. బయటకు చెబితే ఓకే.. లేదంటే లోలోన కుమలి పోవాల్సిందే.

సైకో సాయి..
భూపాల్‌పల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన దానం సాయి కృష్ణ.. సైకో మాదిరిగా తయారయ్యాడు. ఇటీవల బంధువుల ఇంట్లో జరిగిన ఫంక్షన్‌కు హాజరయ్యాడు. అక్కడ తిన్నగా ఉండాలి కదా.. తన ఫోన్‌కి పని చెప్పాడు. మరదలి వరసయ్యే మహిళను చూసాడు. దీంతో ఆమెపై కోరిక పెరిగింది. వరస అయితే మాట్లాడాలి.. కానీ వీడికి కామం పెరిగింది. ఇంకేముంది ఆమెను ఫాలొ చేయడం ప్రారంభించారు.

స్నానం చేస్తుండగా వీడియో
వానికి కూడా సమయం వచ్చింది. ఆమె స్నానం చేస్తుండగా రహస్యంగా సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశాడు. ఇదీ వానికి వరంగా మారింది. ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఆ వీడియో, ఫొటోలను బాధితురాలి వాట్సాప్‌కు పంపించాడు. ఇంకేముంది విస్తుపోవడం ఆమె వంతయిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. నోట మాట రాలేదు. వాడి వేధింపులు ఆగలేదు. అవును తన కామ కోరిక చిట్టాను వాడు బయటపెట్టాడు.

నగ్నంగా వీడియో కాల్
తనతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడాలని వేధించడం స్టార్ట్ చేశాడు. లేదంటే వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని బెదిరించాడు. దీంతో బాధితురాలు వణికోపోయింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు సాయికృష్ణను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి సెల్‌ఫోన్, సిమ్ కార్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

బీకేర్‌పుల్
సో అమ్మాయిలు.. జర జాగ్రత్త.. మీ తప్పేం లేకున్నా ఇలాంటి వేధవల వల్ల ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది. సో వారిని చూసి నవ్విన తప్పే.. ఎందుకంటే కొందరు కామాంధులు అందుకోసమే అని అనుకుంటారు. వారిలో సాయి ఒకడు. ఆ యువతి ధైర్యం చేసింది కాబట్టి ఓకే.. లేదంటే వాడు తన కోరిన చిట్టాను బయటపెట్టేవాడు ఏమో.. ఎంతకయిన మంచిది ఆమె చేసింది ముమ్మాటికీ కరెక్టే.