సిటీలో దంచికొడుతోన్న వాన.. పలు కాలనీలు జలమయం
ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా వర్షం పడుతుంది. హైదరాబాద్ మహానగరంలో కుండపోత వాన కురుస్తోంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. సిటీలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో 10.3 సెంటిమీటర్లు, జీడిమెట్ల, బాలాజీనగర్, బాలానగర్‌లో 8 సెంటిమీటర్లు, మియాపూర్, ఆర్సీపురం, రంగారెడ్డి నగర్, మాదాపూర్, ఫతేనగర్, హెచ్‌సీయూ మోతీనగర్‌లో 5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయింది.

భారీ వర్షానికి హైదరాబాద్‌లోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 18 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక వాహనదారుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.. మరో 3 రోజులు వానలు ఉంటాయని వాతావరణ శాఖ చెబుతుంది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సజెస్ట్ చేస్తోంది. భారీ వర్ష సూచనతో హైదరాబాద్ ప్రజలను ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేశారు. పలు సూచనలు చేశారు. భారీ వర్షాలు కురుస్తున్నందున రోడ్లపైకి రావొద్దని సూచించారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ రోడ్లపైకి రావొద్దన్నారు. భారీ వర్షాలతో వరద నీరు రోడ్లపైకి చేరిన నీరు బయటకు వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు.












Click it and Unblock the Notifications