ఇవాళ, రేపు వర్షాలు.. తెలంగాణలో రెయిన్ అలర్ట్

నైరుతి రుతు పవనాల ఆగమనంతో వర్షాలు కురవడం ఆరంభమైంది. ఇప్పటికే ఢిల్లీలో వర్ష బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉంది. కేరళ మొత్తం, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు విస్తరించాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

రెండు రోజుల్లో కర్ణాటకలోని మరి కొన్ని ప్రాంతాలకి, కొంకన్, గోవాలోని కొన్ని భాగాలకి , తమిళనాడులోని మరికొన్ని భాగాలకు మొత్తము నైరుతి బంగాళాఖాతానికి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని భాగాలకు , ఈశాన్య బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.

rain alert in telangana state today and tomorrow

తెలంగాణలో వాయువ్య దిశ నుంచి కింది స్ధాయి గాలులు రాష్ట్రంలోకి వీస్తున్నాయి. ఇవాళ, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.

ఆసమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. రేపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు.. అక్కడక్కడా కొన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని వివరించారు. నిన్న, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల వాతావరణం చల్లగానే ఉంది. నిన్న రాత్రి తేలికపాటి జల్లులు కురిశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+