హైదరాబాద్‌లో వర్ష బీభత్సం.. జగిత్యాలలో కూడా
హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల రహదారులు చెరువులను తలపించాయి.నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, టోలీచౌకి, రాజేంద్రనగర్‌లో భారీ వర్షం పడింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపైకి భారీగా వర్షం నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

మరోవైపు రాష్ట్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ అధికారులు అన్నారు. ఇటు రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వర్షం పడింది. జగిత్యాల జిల్లాలో కూడా వర్షం పడింది. మెట్‌పల్లి, కోరుట్ల మండలాల్లో భారీగా కురిసింది. జగిత్యాలలో ఓ మోస్తారు వర్షం పడింది. ఇటు ఇప్పటికే కురిసిన వర్షాలతో రైతులు పొలం పనుల్లో నిమగ్నం అయ్యారు. దుక్కి దున్ని సాగు చేసేందుకు సన్నద్దం అవుతున్నారు.
బుధవారం జూన్ 30వ తేదీన మాత్రం ఉక్కపోత ఎక్కువగా ఉంది. మోస్తరు జల్లులు కురవగా.. మరునాడు భారీగానే వర్షం పడింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది.












Click it and Unblock the Notifications