Rain: హైదరాబాద్‍లోని పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం..
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. అమీర్ పేట, ఎస్సార్ నగర్, బోరబండ, యుసఫ్ గూడ, జూబ్లీహిల్స్, మదాపూర్, అయ్యప్ప సోసైటీ, హైటెక్ సిటీ, ఖైరతాబాద్ లో ఉరుములు, మెరుపులతో వాన పడింది.
ఈదురుగాలులతో పలు చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది.సిటీలో మరో రెండు గంటల పాటు భారీ వర్షాలు ఉన్నందున జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ ప్రకటించారు. బయటకు రావొద్దంటూ నగరవాసులకు హెచ్చరిక జారీ చేశారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించింది.

హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాలో కూడా ఈదురుగాలు, ఉరుములు మెరుపులతో వడగళ్ల వర్షం పడింది. వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కొన్ని చోట్ల ఐకేపీ సెంటర్లలోకి వర్షపు నీరు రావడంతో వరి ధాన్యం తడిసిపోయింది.
ధాన్యంపై టర్పరిన్లు కప్పినా.. భారీ వర్షంతో ధాన్యం తడిసిపోయింది. చాలా చోట్ల కోతకొచ్చిన వరి పంట నెలకూలింది. వరి ధాన్యం రాలిపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల మొక్క జొన్న కూడా నెలకూలింది. అటు ఈదురుగాలులకు మామిడి కాయలు రాలిపోయాయి. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో అకాల వర్షాలతో రైతులు నష్టపోయారు. సిద్దిపేట జిల్లాలో నారాయణరావు పేట మండలంలోని మల్యాల, గుర్రాలగొంది, లక్ష్మిదేవిపల్లి, రాఘవాపూర్ పలు గ్రామాల్లో రాళ్ల వర్షం బీభత్సం సృష్టించింది.
SPELL 1 of rain slowly moving away in Hyderabad city after a massive destruction for 45minutes in North Hyderabad, don't go anywhere as SPELL 2 of MASSIVE STORM is approaching from west. Now South Hyderabad too will join the party, STAY INDOORS ⚠️#HyderabadRains
— Telangana Weatherman (@balaji25_t) April 25, 2023
ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. పొలంలో పని చేసే రైతులు, కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా చెట్ల కింద ఉండవద్దని కోరారు. తూర్పు తెలంగాణలో భారీ వడగళ్ల వాన పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఉత్తర దిశ నుంచి తెలంగాణ మధ్య ప్రాంతం వరకు వడగళ్లు భారీగా కురిసే ప్రమాదముందని అంచనా వేస్తోంది. వర్షాలతో పాటు ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని పేర్కొంది.












Click it and Unblock the Notifications