Klinkara: జాతీయ జెండా ఎగరవేసిన క్లీంకార.. వైరల్ అవుతోన్న ఫొటోలు..
మెగాప్రిన్స్ క్లీంకార స్వాతంత్రదినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేశారు. ఆమె అమ్మమ్మ తాతయ్యలు దగ్గరుండి క్లీంకారతో జెండా ఎగురవేయించారు. ఉపసాన తల్లి శోభన, తండ్రి అనిల్ కామినేని కలిసి క్లీంకారను ఎత్తుకుని ఆమెతో జెండాను ఎగురవేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేశారు.
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. అయితే ఈ ఫొటోల క్లీంకార సరిగా కనిపించలేదు. ఫొటోలు చిన్నారి ముఖం కొంత వరకు మాత్రమే కనిపించింది. పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు జూన్ 20న క్లీంకారకు జన్మనిచ్చారు. క్లీంకార పుట్టి రెండు నెలలైనా ఆమెను బయటకు చూపించడం లేదు. మెగా ప్రిన్స్ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కాగా మెగాస్టార్ చిరంజీవికి మోకాలి స్వల్ప శస్త్ర చికిత్స జరిగింది. ఢిల్లీలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చిరంజీవి మోకాలికి చిన్నపాటి సర్జరీ చేశారు. ఎలాంటి కోత లేకుండా ఆర్ద్రోస్పోపిక్ ద్వారా ఈ చికిత్స చేసినట్లు సమాచారం. చిరు రెండు రోజుల్లో తిరిగి హైదరాబాద్ రానున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 22న చిరంజీవి జన్మదినం రోజున ఆయన నటించనున్న నూతన చిత్రం ప్రారంభం మొదలు కానుంది. 'బంగార్రాజు' ఫేమ్ కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు.
ఈ మధ్య చిరు నటించిన భోళా శంకర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విజయవంతగా నడుస్తోంది. సోమవారం రోజు ఈ మూవీకి మంచి కలెక్షన్లు వచ్చాయి. భోళా శంకర్ రోజువారీ కలెక్షన్స్ చూస్తే..తెలుగురాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు రూ.15.38 కోట్లు రాగా.. రెండో రోజు రూ.13 కోట్లు, మూడో రోజు రూ.17 కోట్లు వచ్చాయి.












Click it and Unblock the Notifications