Ramzan 2023:మత సామరస్యానికి ప్రతీక రంజాన్..!
హైదరాబాద్ : ముస్లిం సోదరుల రంజాన్ ఉపవాసాలు శుక్రవారంతో ముగిశాయి .నెలవంక కనిపించినట్టు ఇమామ్‌లు ప్రకటించడంతో రంజాన్ వేడుకలు ప్రపంచవ్వాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి...ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంజాన్ సందర్భంగా హైదరాబాద్ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పలు మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు చేస్తున్నారు. కాగా పలు మసీదుల వద్ద ప్రార్ధనలకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగ నిలుస్తుండంతో... మతంతో సంబంధం లేకుండా ముస్లింలు ప్రతి ఒక్కరికీ స్వీట్స్ పంచుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.మత సామరస్యాన్ని, ఆత్మీయతను, సుహృద్భావాన్ని చాటే అపురూపమైన పండుగ రంజాన్. హిందూ, ముస్లింల మధ్య ఉన్న సోదర భావాన్ని పెంపొందించే పండగ . రంజాన్ పండుగ ప్రతి ఒక్క ముస్లిం కుటుంబంలో ఆనందాన్ని తీసుకువస్తుంది. రంజాన్ రోజు ముస్లిం సోదరులు బిర్యానీ తిని, సేమ్యా ఖీర్ తాగుతూ పండగను జరుపుకుంటారు.

కాగా భిన్న మతాలకు, విభిన్న సంస్కృతులకు నిలయమైన తెలంగాణలో కూడ పలువురు హిందువులు ఆయా ముస్లిం సోదరుల నివాసాలకు వెళ్లి మత సామరస్యాన్ని పెంపొందించే విధంగా వారికి రంజాన్ శుభాకాంక్షాలు తెలిపారు. ఈనేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలు ముస్లింలకు రంజాన్ పండగ శుభాకాంక్షాలు తెలిపారు.
గత కొన్నేళ్లుగా బోనాలు, బతుకమ్మ, గణేష్ జయంతి, రంజాన్, క్రిస్ మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం...ఈ ఏడాది కూడా రంజాన్ పండుగను రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ఘనంగా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఈద్గాలు, మసీదుల వద్ద పూర్తిస్థాయి సదుపాయాలను కల్పించింది.ఏపీలో కూడా జగన్ ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన విషయం తెలిసిందే..
రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి ముస్లిం తనకున్న కొద్దిపాటి సంపాదనలో కొద్దో గొప్పో దానం చేయాలని ఖురాన్ చెబుతోంది. దీంతో ఉన్నత కుటుంబాల్లో ఉన్న ముస్లింలు వారి స్థాయిలను బట్టి ఈరోజు ఆర్థికంగా వెనకబడిఉన్న ముస్లింలకు సహాయం చేస్తున్నారు.దీంతో తెలంగాణ ప్రభుత్వం కూడ రంజాన్ కానుకలను ముస్లింలకు అందించింది.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు మసీదులు ప్రార్థనలతో కళకళ లాడుతున్నాయి.
-
రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!!












Click it and Unblock the Notifications