Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ పార్టీ ఏర్పాటు..? ఒక శక్తిగా స్వేరో..

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. గురుకులాల కార్యదర్శిగా పనిచేసి మంచిపేరు తెచ్చుకున్నారు. ఐపీఎస్ అయినా.. గురుకులాల కార్యదర్శి కోసం పట్టుబట్టి మరీ పనిచేశారు. చిన్నారులు ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు కృషిచేశారు. స్వేరో సంస్థ ప్రారంభించి.. దానిని ఒక శక్తిగా మలిచారు. అయితే సర్వీస్ ఉండగా రాజీనామా చేయడం చర్చానీయాంశం అవుతోంది. హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తారని ప్రచారం జరిగినా.. దానిని ఖండించారు. దీంతో ప్రవీణ్ కుమార్ రాజకీయ పార్టీ పెడతారా అనే చర్చకు దారితీసింది.

రాజకీయ శక్తిగా..

రాజకీయ శక్తిగా..

రాజీనామా చేసిన తర్వాత ప్రజలకు కృతజ్ఞతలు తెలుపారు. శేష జీవితాన్ని స్ఫూర్తిప్రదాతలైన మహాత్మా జ్యోతిరావుపూలే దంపతులు, బాబా సాహెబ్‌ అంబేద్కర్‌, కాన్షీరాం చూపిన మార్గంలో నడిచి పేదలకు, పీడితులకు అండగా ఉంటూ భావితరాలను కొత్త ప్రపంచంలోకి నడిపించే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. కొత్త ప్రయాణంలో అందరి దీవెనలు ఉండాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. దీంతో ప్రవీణ్ కుమార్ ప్రజా జీవితంలోకి వస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్వేరోయిజాన్ని ప్రారంభించి ఒక ఉద్యమంగా వ్యాప్తి చెందేలా చేసిన ప్రవీణ్‌కుమార్‌.. ఇతర రాజకీయ పార్టీల్లో చేరకుండా తానే ఒక రాజకీయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తారని అర్థమవుతోంది. కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తారని కొందరు అంటున్నారు.

స్వేరో ఒక శక్తి..

స్వేరో ఒక శక్తి..

ప్రవీణ్‌ కుమార్‌, స్వేరో అనే సంస్థను స్థాపించి దళితవర్గాలను ఒక్కటి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సత్ఫలితాలు కూడా సాధించారు. ఆ సంస్థ నాయకుడిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు స్వేరో సభ్యుల్లో ఉన్నతస్థానం ఉంది. ఇదీ రాజకీయ పార్టీగా మలిచేందుకు అవకాశం ఉంది. అందుకే ఏ పార్టీలో చేరనని ప్రవీణ్ కుమార్ చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

 దళితులే కాక ఇతరులు

దళితులే కాక ఇతరులు

గురుకులాల కార్యదర్శిగా కూడా దళిత విద్యార్థులను చదువులోనే కాకుండా వివిధ రంగాల్లో ఉన్నతస్థానాల్లో నిలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆయన గురుకులాల కార్యదర్శిగా కొనసాగడం ఆయన సాధించిన ఫలితాలే కారణం. దళితవర్గాల్లో ఆయనకు ఉన్న మంచి పేరు కారణంగా ప్రభుత్వం ఆ పదవిలో కొనసాగించించింది. ఇప్పుడు ఊహించని విధంగా ప్రవీణ్‌ కుమార్‌ ఉద్యోగానికి స్వచ్ఛందంగా ముందస్తూ రాజీనామా చేయడంతో రాజకీయాల్లో వచ్చే అంశం తెరపైకి వచ్చింది. కానీ ఇతర పార్టీలో కాకుండా.. సొంతంగా పార్టీ పెడతారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+