సెక్స్ రాకెట్: సిటీలో పట్టుబడ్డ ముఠా, మహిళకు విముక్తి.. నలుగురు అరెస్ట్
విశ్వనగరి భాగ్యనగరంలో సెక్స్ రాకెట్లు బయటపడుతున్నాయి. ఇటీవల రైడ్లు చేయడంతో వరసగా పట్టుబడుతున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లాంటి కాస్ట్లీ ఏరియాలోనే.. మాదాపూర్, హైటెక్ సిటీ లాంటి టెక్ ప్రాంతాలతో పాటు వనస్థలీపురంలో కూడా సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు. దీంతో ఏ మూలానా ఏం జరుగుతుందోననే సందేహాలు వస్తున్నాయి.

పక్కా సమాచారంతో రైడ్..
పక్కా సమాచారంతో పోలీసులు లాడ్జీపై రైడ్ చేశారు. అక్కడ ముగ్గురు ఉన్నారు. వారిపై అనుమానం వచ్చి.. స్పెషల్ రూం తనిఖీ చేశారు. అందులో ఓ జంట.. వారితో ఓ కస్టమర్ ఉన్నారు. వారు వ్యభిచారానికి ఆమెను ఒప్పిస్తున్నారు. రిసెన్షన్ వద్ద ఉన్న శేఖర్, గురయ్య.. లాడ్జీలో వ్యభిచారం నిర్వహించాలనే ప్రణాళిక రచించారు. అందుకోసం గది కూడా తీసుకున్నారు. లాడ్జీ యజమాని రమేశ్వర్‌తో ఒప్పందం కూడా చేసుకున్నారని పోలీసులు తెలిపారు.

వ్యభిచారం..
శేఖర్, గురయ్య, శిల్పి బర్మాన్‌ను సంప్రదించి ఆమెను వ్యభిచారానికి ఒప్పించినట్టు విచారణలో తెలిపింది. వారి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు శిల్పిని ప్టుకున్నారు. శేఖర్, గురయ్య, శిల్పి, రామేశ్వర్, కస్టమర్‌ను అరెస్ట్ చేశారు. వారి బరినుంచి బాధితురాలిని రక్సించారు. నిర్వహకులు కస్టమర్ల నుంచి రూ.2 వేలు వసూల్ చేశారని తెలిసింది. కానీ బాధితురాలికి రూ.500 మాత్రమే ఇచ్చారని తెలిపింది. వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

రైడ్ చేస్తే తప్పా..
సిటీలో డ్రగ్స్ ముఠా పట్టుబడుతూనే ఉన్నాయి. సెక్స్ రాకెట్లు, స్పా ముసుగులో వ్యభిచారం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కరోనా కాలంలో కూడా ఈ దందాలు మాత్రం ఆగడం లేదు. మహిళలను తీసుకొచ్చి.. వారిని వ్యభిచార రొంపిలోకి దించుతున్నారు. వీరిలో చాలామట్టుకు తెలియకుండా వస్తున్నారు. తిరిగి వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. పోలీసులు దాడి చేసి.. పట్టుకుంటే తప్పా.. వారికి విముక్తి లభించే సిచుయేషన్ లేదు.

తనిఖీలు
వాస్తవానికి పోలీసులు, ఎస్వోటీ సిబ్బంది ఎప్పుడూ తనిఖీ చేపడుతూనే ఉన్నారు. అయినా వారి కళ్లు గప్పి మరీ దందా కొనసాగిస్తున్నారు. వీరిలో మైనర్లు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వెట్టిచాకిరీ నుంచి విముక్తి కలిగించాల్సిన అవసరం ఉంది.
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications