సోనియాగాంధీ గొప్ప నాయకురాలు : ఉత్తమ్.. గాంధీభవన్ లో ఘనంగా జన్మదిన వేడుకలు
హైదరాబాద్ : సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిన గొప్ప నాయకురాలు సోనియాగాంధీ అంటూ కొనియాడారు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వలసలు నివారించేలా ఉపాధి హామీ పథకం తీసుకువచ్చిన ఘనత కూడా సోనియాగాంధీకే దక్కుతుందని చెప్పారు. డిసెంబర్ 9 ఆమె జన్మదినం కావడంతో హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియాగాంధీ పాత్ర మరచిపోలేదని గుర్తుచేసుకున్నారు పార్టీ నేతలు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న యూపీఏ హయాంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలయేందుకు సోనియాగాంధీయే కారణమని తెలిపారు. సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షురాలిగా సేవలందించిన నాయకురాలు సోనియాగాంధీ.. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.













Click it and Unblock the Notifications