వావ్.. పుష్ప మేనియా.. శ్రీవల్లి ఇంగ్లిష్ సాంగ్.. నెదర్లాండ్ సింగర్ ఇలా పాడారు..
ఇటీవల వచ్చిన పుష్ప మూవీలో సాంగ్స్ అన్నీ సూపర్ హిట్టే. అందులో శ్రీ వల్లి సాంగ్‌కు సిద్ శ్రీ రామ్ ప్రాణం పోశారు. ఏ నోట విన్న అదే పాట.. అయితే అదీ రాష్ట్రమో.. దేశానికో పరిమితం కాలేదు. అవును ఖండతరాలు దాటింది. ఇప్పటికే పుష్ప మూవీలో గల మీమ్స్ చేస్తున్నారు. డేవిడ్ వార్నర్.. బన్నీలాగా నడుస్తూ వీడియో షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఓ ఇంటర్నేషనల్ సింగర్ పాట పాడింది. అదీ కూడా ఇంగ్లీషులో సాంగ్ అందుకుంది.
పుష్పలోని 'శ్రీవల్లి' పాట అంతకంటే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లింది. ఈ పాట ఖండాంతరాలు దాటి యూరప్‌లోనూ మోత మోగిస్తోంది. 'శ్రీవల్లి' పాటను నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ గాయని ఎమ్మా హీస్టర్స్ అద్భుతంగా ఆలపించింది. ఆ వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసింది. శ్రీ వల్లి పాట ప్రారంభంలో ఇంగ్లీషు లిరిక్స్ కూడా జోడించింది. ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పుష్ప సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్ దృష్టికి వచ్చింది. ఆయన ఈ వీడియో చూసి ఆశ్చర్యపోయారు. సిద్ శ్రీరామ్ బ్రో... ఈ పాట రికార్డు చేస్తున్న సమయంలో శ్రీవల్లి ఇంగ్లీష్ వెర్షన్ కూడా చేయాలని మనం అనుకున్నాం కదా... అయితే ఈ పాటకు అద్భుతమైన కవర్ సాంగ్ వచ్చింది... ఇదిగో!" అంటూ ఎమ్మా హీస్టర్స్ పాడిన పాట వీడియోను కూడా పంచుకున్నారు.
పుష్ప మూవీ.. రెండు పార్టులుగా వస్తోన్న సంగతి తెలిసిందే. పుష్ప ది రైజ్.. పుష్ప ది రూల్‌గా రాబోతుంది. మూవీకి జనం నుంచి విశేష స్పందన వచ్చింది. మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. వాస్తవానికి ఈ సినిమాను సుకుమారు.. మహేశ్ బాబుతో చేయాలని అనుకున్నారట.. కానీ ఆయన ఓకే చేయకపోవడంతో.. బన్నీతో చేశారు. అతనిని ఓ రేంజ్‌కు తీసుకెళ్లారు. పాటలు కూడా మంచి హిట్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications