Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్వాతి నాయుడు సంచలనం: మూవీ షూటింగ్‌ గురించి పోలీసుల వేధింపులు, వీడియో పోస్ట్, వైరల్

శృంగార తార స్వాతి నాయుడు మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈ సారి తన భర్త గురించి మాత్రం కాదండొయ్. తాను నటించిన సినిమా గురించి కామెంట్స్ చేశారు. ఇందులో పలువురికిని ఇరుకున పెట్టేలా స్వాతి నాయుడు కామెంట్ చేయడం చర్చకు దారితీసింది. దీనికి సంబంధించి మూడు వారాల క్రితం స్వాతినాయుడు వీడియో పోస్ట్ చేశారు. అదీ ఇప్పుడు వైరల్ అవుతోంది. పోలీసులు తనను వేధిస్తున్నారని అందులో ఆరోపించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మూవీ షూటింగ్ విషయంలో..

మూవీ షూటింగ్ విషయంలో..

మూడేళ్ల క్రితం నటించిన మూవీ ‘నేనే దేవుడ్ని' సినిమా విషయంలో తనని స్టేషన్‌కి రావాలంటూ పోలీసులు వేధిస్తున్నారని యూట్యూబ్‌ ఛానల్‌లో వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్న జీయర్ స్వామి, శివశక్తి ఛానల్ కరుణాకర్ సుగుణ పేర్లను ప్రస్తావించడం విశేషం. కొన్ని పోలీస్ స్టేషన్ల నుంచి తనకు ఫోన్స్ వస్తున్నాయని వివరించారు. నేనే దేవుడ్ని సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశానని.. దానికి వెయ్యో.. రెండువేలో పేమెంట్ ఇచ్చారని తెలిపారు. కరుణాకర్ సుగుణ సినిమా తీశాడని.. యూట్యూబ్‌లో ఇప్పటికీ ఆ సినిమా ఉందన్నారు. కొన్ని రోజుల తరువాత పోలీస్‌లు ఇంటికొచ్చి.. నేనే దేవుడ్ని సినిమాలో యాక్ట్ చేశానని.. దానిపై కంప్లైంట్ వచ్చిందని చెప్పారు. అయితే తనలాగ ఆ సినిమాలో వందమందికిపైగా ఆర్టిస్టులు నటించారని.. మరి వాళ్లందరి ఇంటికి వెళ్లారో లేదో తెలియదన్నారు.

ఆశ్రమంలోనే షూట్..

ఆశ్రమంలోనే షూట్..

సినిమా షూటింగ్ మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో జరిగిందని.. షూటింగ్ పూర్తయిన తర్వాత పోలీసులు వచ్చి హడావిడి చేశారని స్వాతి నాయుడు వివరించారు. షూటింగ్ చేసింది కరుణాకర్ సుగుణ అని.. వాళ్లతో మాట్లాడమని పోలీసులకు చెప్పానని పేర్కొన్నారు. వారు పరారీలో ఉన్నారని పోలీసులు చెప్పారు. రెండేళ్ల క్రితం డిస్కషన్స్ జరగగా.. మూడు వారాల క్రితం పోలీసులు ఫోన్ చేసి.. స్టేషన్‌కి రావాలని అంటున్నారని స్వాతినాయుడు వాపోయారు. ఎందుకు అంటే నేనే దేవుడ్ని సినిమా షూటింగ్ గురించి అని చెబుతున్నారు. ఆ సినిమాలో తను చేసింది చిన్న రోల్.. మరి తనను ఎందుకు పిలుస్తున్నారో తెలియడం లేదన్నారు. చాలామంది ఆ సినిమాలో నటించారని.. వారిని పిలిచారా? ఆ సినిమా షూటింగ్‌ కూడా చిన్న జీయర్ ఆశ్రమంలో జరిగిందని.. మరి ఆయన్ని పిలిచారా అని అడిగారు.. షూటింగ్‌కి లొకేషన్ ఆయన ఎందుకు ఇచ్చారు? జీయర్ స్వామికి అన్నీ తెలుసు.. వాళ్లూ వాళ్లూ ఒక్కటే. శివశక్తి ఛానల్ కరుణాకర్ సుగుణని పిలిచారా?? అని ప్రశ్నించారు.

 తనను ఎందుకులాగుతారు..

తనను ఎందుకులాగుతారు..

ఇష్యూ ఉంటే మీరు మీరు చూసుకోండి.. తనతోతో ఏం పని అని స్వాతినాయుడు అంటున్నారు. తనను ఎందుకు స్టేషన్‌కి రమ్మంటున్నారని అడిగారు. షూటింగ్ చేసినవారు, చేయించినోళ్ల.. నటించిన మిగిలినవాళ్లు ఏమయ్యారు అని నిలదీశారు. తను ఒక్కదాన్నే దొరికానా.. పోలీసులకు? అని ఫైరయ్యారు. తను ఏ దేవుడికి సపోర్ట్ చేయడం లేదు.. ఏ దేవుడ్ని విశ్వసించాను అని స్వాతినాయుడు తెలిపింది. తాను నమ్మేది మనిషిని అని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. కరోనా సమయంలో మనిషిని డాక్టర్లు కాపాడుతున్నారని వివరించారు. నేనే దేవుడ్నిసినిమా ఏసుక్రీస్తుకి వ్యతిరేకంగా ఉందా.. అయితే శివశక్తి అనే వాళ్లు ఏసుక్రీస్తుకి వ్యతిరేకంగా చేస్తున్నారా అని అడిగారు.

తాను చేసింది చిన్న క్యారెక్టర్...

తాను చేసింది చిన్న క్యారెక్టర్...

ఇదంతా చేసింది కరుణాకర్ సుగుణ అని స్పష్టంచేశారు. అతను బయటక హ్యాపీగానే తిరుగుతున్నాడు అని వివరించారు. శివశక్తి ఛానల్ ఓపెన్ చేసి చూస్తే.. పాస్టర్స్‌తో కరుణాకర్ రమ్మీ ఆడుతున్నారని.. దీనిని చాలా మంది చూశారని తెలిపారు. తాను యాక్ట్ చేసిన వీడియో చిన్న జీయర్ స్వామి గారి సౌజన్యంతో ఆశ్రమంలో షూట్ చేశారని తెలిపారు. ముందు వారిని పిలిపించి అడగాలని కోరారు. జస్ట్ తాను అందులో చిన్న పాత్ర వేశానని చెప్పారు. పెద్ద పెద్ద వాళ్లని వదిలేసి.. చిన్నవారిపై ప్రతాపం చూపిస్తారా అని అడిగారు. పోలీసులు అంటే న్యాయం చేయాలి కానీ అన్యాయం చేస్తే ఎవరూ ఊరుకోరన్నారు. షూటింగ్ మూడేళ్ల క్రితం జరగగా.. మూడువారాల క్రితం తనను వేధిస్తున్నారని స్వాతినాయుడు వీడియో పోస్ట్ చేశారు. అదీ ఇప్పుడు వైరల్ అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+