మరిన్ని మార్పులు.. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తార్నాక దవాఖాన
ఆర్టీసీలో సమూల మార్పులు జరుగుతున్నాయి. ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్.. ఒక్కో విభాగం మీద దృష్టిసారించారు. ఇప్పటికే ఆర్టీసీలో ఉద్యోగాల ప్రకటనకు సంబంధించి నోటిఫికేషన్ జారీచేశారు. మరోవైపు తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించుకున్నామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. దీని కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన తెలిపారు. సోమవారం తార్నాక ఆర్టిసీ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవల ప్రారంభ కార్యక్రమంలో సజ్జనార్ పాల్గొన్నారు.
ఆస్పత్రిలో డయాలసిస్, 24 గంటలు ఫార్మా యూనిట్, ఇప్పుడు ఐసీయూ ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే మార్చి లోపు కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిద్దుతామని స్పష్టం చేశారు. అందరి కృషితో రెండు నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తామని వివరించారు. బరంరాకె, లేగాటో, డి.బీ.ఎస్ నుంచి దాతలు ముందుకొచ్చారని సజ్జనార్ తెలిపారు. ఆర్టీసీ ఆదాయం పెరిగిందని..ఆదాయం కార్డ్ స్థాయికి పెరిగిందని సజ్జనార్ అన్నారు.

ఉద్యోగుల కోసం యాజమాన్యం ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. అందరూ సమిష్టిగా కృషి చేసి ఆర్టీసీ ఆదాయాన్ని పెంచడంలో పాలుపంచుకోవాలని సజ్జనార్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగల కోసం తార్నాకలో ప్రత్యేక ఆస్పత్రి ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చటానికి సజ్జనార్ కృషి చేస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్‌గా తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్న సెన్సెషనల్ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
సజ్జనార్ ఆర్టీసీగా ఎండీగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పలు కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నారు. వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీలో తన దైనశైలిలో వినూత్న చర్యలు చేపట్టారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు తన వంతుగా కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ఆర్టీసీ లాభాల్లో పడిందని తెలిపారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications