భార్య, అత్తమామల వేధింపులు తాళలేక టెక్కీ ఆత్మహత్య..
హైదరాబాద్ : కొత్తగా పెళ్లైంది. భార్య రాకతో జీవితం కొత్త బంగారులోకం అవుతుందని అనుకున్నాడు. అయితే అనుకున్నట్లు సాగితే అది జీవితం ఎందుకవుతుంది. కట్టుకున్న భార్య, అత్తమామలే తన పాలిట యమకింకరులవుతారని ఊహించలేకపోయాడు. వారి వేధింపులు తాళలేక పెళ్లై నాలుగు నెలలు గడవక ముందే ఆత్మహత్య చేసుకున్నాడు. హృదయ విదారకమైన ఈ ఘటన హైదరాబాద్ అత్తాపూర్‌లో జరిగింది.

పెళ్లైన నాటి నుంచి వేధింపులు
ఇబ్రహీంపట్నం గున్‌గల్ గేట్‌కు చెందిన జనార్థన్ రెడ్డి కుమారుడు సుమంత్ రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం అతనికి శంషాబాద్‌కు చెందిన స్వప్నతో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత వారు కుటుంబ సభ్యులతో కలిసి అత్తాపూర్‌లోని లక్ష్మీపోర్ట్ వ్యూ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు. పెళ్లి జరిగిన కొన్ని రోజుల వరకు అంతా సజావుగా సాగింది. ఆ తర్వాత భార్యతో చిన్న చిన్న గొడవలు జరగడం ఆ విషయంలో ఆమె తల్లిదండ్రులు తలదూర్చడం పరిపాటిగా మారింది. వారంతా చీటికిమాటికి సుమంత్‌ను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. అత్తమామలకు భార్య తోడవడం వేధింపులు రోజురోజుకు పెరిగాయి.

సూసైడ్ నోట్ రాసి
భార్య, అత్తామామల వేధింపులు పెరిగిపోవడంతో సుమంత్ రెడ్డి వాటిని భరించలేకపోయాడు. చివరకు ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 20న భార్యభర్తల మధ్య మరోసారి గొడవ జరగడంతో సాయంత్రం తన బెడ్ రూంలోకి వెళ్లి ఉరివేసుకున్నాడు. 5.30గంటల సమయంలో కుటుంబసభ్యులు గదిలోకి వెళ్లి చూసి షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తన చావుకు భార్య, అత్తమామ, వారి కుటుంబసభ్యులే కారణమని సుమంత్ సూసైడ్ నోట్‌లో రాశాడు. తన ఆత్మహత్యకు కారణైన వారందరినీ కఠినంగా శిక్షించాలని, అంత్యక్రియలకు వారు రాకుండా చూడాలని అందులో స్పష్టం చేశాడు.

కేసు బుక్ చేసిన పోలీసులు
సుమంత్ సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతని భార్య స్వప్న, అత్త పద్మ, స్వప్న కజిన్ శ్రీ, బాబాయిపై కేసు నమోదుచేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత పోలీసులు విషయం బయటపెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications