హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బలోపేతంపై బీజేపీ ఫోకస్.. చేరికల కోసం సమన్వయ కమిటీ..

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్ చేసింది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరే వారి కోసం ఏకంగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. జాయినింగ్స్ అండ్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్‌గా బీజేపీ సీనియర్ నేత, నల్లు ఇంద్రసేనారెడ్డిని నియమించారు. కమిటీలో స్వామి గౌడ్, మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్, డీ రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావుతోపాటు మరో ఇద్దరు సభ్యులుగా ఉంటారు.

పార్టీలో చేరడానికి ఎవరినీ సంప్రదించినా ముందుగా సమన్వయ కమిటీకి తెలపాల్సి ఉంటుంది. పార్టీలో చేరే వారితో చర్చలు, వారి బలాబలాలు అంచనా వేయడం, పార్టీ నాయకత్వానికి తెలియజేయడం వీరి బాధ్యత. ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ వేశారు. ఈ నెల 19వ తేదీన రాష్ట్రంలోని ST నియోజవర్గాలపై హైదరాబాద్‌లో బీజేపీ నేతలు మీటింగ్ నిర్వహిస్తారు.

telangana bjp focus on party Strengthening

ఎస్టీ నియోజకవర్గాల సమన్యాయ కమిటీ ఛైర్మన్‌గా గరికపాటి మోహన్ రావుని నియమించారు. చాడా సురేష్ రెడ్డి, కటకం మృత్యుంజయం, కూన శ్రీశైలం గౌడ్ సభ్యులుగా ఉంటారు. డిసెంబరు 28నే ఎస్సీ నియోజకవర్గాలపై బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. మిషన్-19 పేరుతో ఎస్సీ నియోజకవర్గలపై ఫోకస్ చేశారు. ఎస్టీ నియోజకవర్గలపైనా కమలనాథులు ఫోకస్ చేశారు.

జనవరి 19వ తేదీన రాష్ట్రంలో గల ఎస్టీ నియోజవర్గాలపై హైదరాబాద్‌లో బీజేపీ నేతలు మీట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. సమావేశానికి బండి సంజయ్ కూడా హాజరవుతారు. పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో అన్వేషిస్తున్నారు. బల బలాల అంచనా.. నియోజకవర్గాల్లో బలమైన నేతల ఎంపిక.. క్యాడర్‌తో సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగనున్నారు. వాస్తవానికి ఇప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు లేవు.. అయినప్పటికీ నియోజకవర్గాల్లో బలపడాలని బీజేపీ అనుకుంటుంది. ఆ విధంగా కార్యాచరణ చేసుకొని.. ముందుకుసాగుతుంది.

బండి సంజయ్ ఇతర ముఖ్య నేతలు ఓ పది మంది వరకు బలంగా ఉన్నారు. రాష్ట్రలో గల మిగతా నియోజకవర్గాల్లో కూడా అలా నేతలను ఎంపిక చేయాల్సి ఉంది. పార్టీ ఇమేజ్ పెరుగుతున్న నేపథ్యంలో.. బలమైన నేతల వైపు తెలంగాణ బీజేపీ చూస్తోంది.

English summary
telangana bjp focus on party Strengthening. state bjp chief bandi sanjay set up committee for joinings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X