అనసూయ భరద్వాజ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు: ట్విట్టర్ స్పందనపై అసంతృప్తి, సైబర్ క్రైం పోలీసులకు థ్యాంక్స్
హైదరాబాద్: సినీ నటి, ప్రముఖ తెలుగు యాంకర్ అనసూయ భరద్వాజ్‌కు సోషల్ మీడియాలో ఆకతాయిల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి, మామూలు కామెంట్లు కాకుండా అసభ్యకరరీతిలో అవి ఉండటంతో ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆ కామెంట్లకు సంబంధించిన వివరాలు ఇవ్వడంతో.. తాము చర్యలు తీసుకుంటామని పోలీసులు ఆమెకు హామీ ఇచ్చారు.
అనసూయ ఫొటోలతో పెట్టి అసభ్యంగా..
‘యాక్ట్రెస్ మసాల' అనే అకౌంట్ ద్వారా ఓ నెటిజన్ అనసూయపై, సినీ నటి అనుష్కపై అసభ్యకరరీతిలో కామెంట్స్ పెట్టాడు. ఈ ట్వీట్ స్క్రీన్ షాట్స్ తీసి ఇలాంటి అకౌంట్స్‌పై చర్యలు తీసుకోవాలని అనసూయ ట్విట్టర్ నిర్వాహకులను కోరారు.
అయితే ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంతేగాక, నిబంధనలకు వ్యతిరేకంగా వారు వ్యవహరించినట్లు ఎక్కడా కనిపించలేదని ట్విట్టర్ అనసూయకు జవాబు ఇవ్వడం గమనార్హం. ట్విట్టర్ ర్లిపైపై అనసూయ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ ట్వీట్‌ను కూడా సైబర్ పోలీసులకు అందించారు.
చర్యలు తీసుకోవాలంటూ.. సైబర్ క్రైం పోలీసులకు థ్యాంక్స్
‘డియర్ ట్విట్టర్ సపోర్ట్.. దయచేసి మీ రూల్స్‌లో కొన్ని మార్పులు చేసుకోండి. ఇది ట్విట్టర్ వైలేషన్ కాకపోతే మరేంటి? దీనిని సైబర్ క్రైంగా పరిగణించకపోతే మీదే తప్పు అని చెప్పడానికి కూడా నేను వెనుకాడను. దయచేసి ఈ ట్వీట్స్‌పై చర్యలు తీసుకోవడానికి సరైన అధికారులను ట్యాగ్ చేయాల్సిందిగా సైబర్ క్రైం పోలీసులను కోరుకుంటున్నా' అని అనసూయ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. దీంతో సైబర్ క్రైం పోలీసులు వెంటనే స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనసూయకు హామీ ఇచ్చారు. దీంతో పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవల అనసూయ ఫొటోలు మార్ఫింగ్ చేసి..
సోషల్ మీడియాలో మహిళల పట్ల ఇలా అసభ్యకరంగా వ్యవహరించే వారిపై శిక్షించకుంటే ఇలాంటి వారు మరికొంతమంది తయారవుతారని వ్యాఖ్యానించారు. దండన ఉంటేనే ఇలాంటి వారిలో భయం ఉంటుందని చెప్పారు. ఇటీవల కూడా తన ఫొటోలను మార్ఫింగ్ చేసి కొందరు అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని.. వారి గురించి తెలిస్తే తనకు తెలియజేయాలని అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. కాగా, సినీతారలకు సోషల్ మీడియాలో ఆకతాయిల నుంచి ఇలా వేధింపులు ఎదురవుతూనే ఉన్నాయి. కఠినంగా శిక్షిస్తేనే ఇలాంటి తగ్గుతాయని బాధితులు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications