Harassment : షూటింగ్‌లో ఆ పని చేయమని డైరెక్టర్ ఒత్తిడి ..చెంప చెల్లుమనిపించిన నటి..!
సినిమా వాళ్ల జీవితాలు ఏ క్షణానా ఎలా మారుతాయో తెలియని పరిస్థితి. గతంలో సినిమా వాళ్ల జీవితంలో ఏం జరిగినా పెద్దగా బయటకు తెలిసేది కాదు. కాని సోషల్ మీడియా విస్తృతంగా ఉన్న ఈ రోజుల్లో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లోనే అందరికి తెలిసిపోతుంది. సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలైతే.. ఇట్టే సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఇటీవల కాలంలో సినిమావాళ్లకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో ఎక్కువుగానే హల్ చల్ అవుతున్నాయి.
హీరో, హీరోయిన్ల విడాకుల దగ్గర నుంచి మహిళల మీద ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపులు, హీరోల పారితోషకాలు ఇలా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తాజాగా ఓ నటి తనకు ఎదురైన ఓ సంఘటన గురించి వివరించింది. ఆ నటి మరెవ్వరో కాదు...రక్ష. నేటి తరానికి రక్ష గురించి పెద్దగా తెలియకపోవచ్చు కాని ..1990ల్లో సినిమాలను ఫాలో అయ్యేవారికి రక్ష సుపరిచితురాలే. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఐటమ్ సాంగ్స్ ఇలా అనేక రకాలుగా అభిమానులను అలరించారామె.

ముఖ్యంగా 'ప్రేమలేఖ' సినిమాలోని 'చిన్నదాన ఓసి చిన్నదాన' అంటూ సాగే పాటలో ఆమె అందాలకు ఫిదా కాని ప్రేక్షకులుండరు. నాగవల్లి, నిప్పు, రచ్చ, మేం వయసుకు వచ్చాం, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, దువ్వాడ జగన్నాథమ్ వంటి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైన ఓ సంఘటన గురించి వివరించింది.

ఓ డైరెక్టర్ మంచి సినిమా అని చెప్పి..తరువాత నా చేత పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేయించి .. బోల్డ్‌గా నటించాలని ఒత్తడి చేశాడని రక్ష చెప్పుకొచ్చింది. ఇలాంటి సీన్లు తాను చేయనని చెప్పానని.. అయినప్పటికీ ఇబ్బంది పెడుతుండటంతో ఆ దర్శకుడు చెంప చెళ్లుమనిపించి ఏంట్రా..? నా గురించి అసలు ఏమనుకుంటున్నావ్ ? అంటూ ఈ సినిమాను వదిలేసి బయటకు వచ్చేశానని రక్ష తెలిపారు. అయితే ఆ డైరెక్టర్ పేరు చెప్పడానికి మాత్రం రక్ష ఇష్టపడలేదు. ఇండస్ట్రీలో మంచివాళ్లతో పాటు.. ఇలాంటి వాళ్లు కూడా ఉంటారని.. అన్నింటిని తట్టుకుని ముందుకు వెళ్తాం అనుకుంటూనే ఇండస్ట్రీలో అడుగుపెట్టండి అంటూ నటి రక్ష యంగ్‌స్టార్స్ సూచనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications