ముస్తఫా.. ముస్తఫా.. డోన్ట్ వర్రీ ముస్తఫా!

భౌతిక జీవనంలో మనిషికి ఎన్ని బంధాలున్నప్పటికీ స్నేహానికి సాటివచ్చేది ఏదీ లేదు. ప్రాణానికన్నా మిన్న స్నేహం అనిపిస్తుంటుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా మంచి స్నేహితులుగా కొనసాగుతున్నవారు చాలామంది ఉన్నారు. తరతరాల నుంచి కూడా మైత్రిని కొనసాగించేవారున్నారు. మన పరిశ్రమలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్: తెరమీద పవన్ కల్యాణ్ చేసే మాయాజాలం వెనక ఉండేది త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్ కు ఎవరైనా ఆప్తుడు ఉన్నాడా? అంటే అది త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక్కరే. జల్సా సినిమా నుంచి వీరి స్నేహం బ్రో వరకు కొనసాగుతూనే ఉంది. భవిష్యత్తులో కూడా వీరిద్దరూ మంచి మిత్రులుగా నిలబడబోతున్నారు.

telugu film Industry best Friends details

రామ్ చరణ్ - శర్వానంద్: సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టక ముందు నుంచే వీరిద్దరూ మంచి స్నేహితులు. క్లాస్ మేట్స్ కూడా. అప్పటి నుంచి నేటివరకు వీరి స్నేహం కొనసాగుతూనే ఉంది.

జానియర్ ఎన్టీఆర్ - రాజీవ్ కనకాల: జూనియర్ ఎన్టీఆర్ ప్రతి చిత్రంలో కూడా రాజీవ్ కనకాల కచ్చితంగా ఉంటారు. పరిశ్రమలోకి అడుగు పెట్టిన తర్వాత జూనియర్ కు పరిచయమై మంచి మిత్రులుగా కొనసాగుతున్నవారిలో రాజీవ్ కనకాల ఒకరు.

ప్రభాస్ - గోపి చంద్: వర్షం చిత్రం సమయంలో వీరిద్దరి మధ్య స్నేహ బంధం ఏర్పడింది. ఇప్పటివరకు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఒకరి చిత్రాన్ని మరొకరు ప్రమోట్ చేసుకుంటారు. పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ ఎంత స్థాయిలో ఉన్నా తన స్నేహితుడిని మాత్రం మరవడు. అది గొప్ప విషయం.

రకుల్ ప్రీత్ - మంచు లక్ష్మీ: తెలుగు పరిశ్రమలో వీరిద్దరూ మంచి స్నేహితులు. మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరించిన ఏ షోకైనా రకుల్ కచ్చితంగా వస్తుంది. ఖాళీ ఉన్నప్పుడల్లా వీరిద్దరూ పార్టీలు, పబ్ లు అంటూ తిరుగుతుంటారు.

జెనిలీయా - రామ్ పోతిని: రెడీ చిత్రం నుంచి వీరిమధ్య స్నేహ బంధం ఏర్పడింది. జెనిలీయా ఇప్పటికీ ఎన్నో సార్లు తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరని అడితే రామ్ పోతినేని అని చెబుతుంది.

telugu film Industry best Friends details

ఎన్టీఆర్ - ఏఎన్ఆర్: ఆ రోజుల్లో చాలా మంచి స్నేహితులు. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు.

అఖిల్ - నితిన్: సినీ పరిశ్రమలో ఉన్న మంచి స్నేహితుల్లో వీరిద్దరు కూడా ఉన్నారు. అఖిల్ మొదటి సినిమాను నితిన్ సొంత బ్యానర్ లోనే తీశారు.

రవితేజ - పూరి జగన్నాథ్: డైరెక్టర్ పూరి జగన్నాథ్, రవితేజల మధ్య మంచి స్నేహం ఉంది. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది.

నయనతార - త్రిష: వీళ్ళిద్దరి మధ్య ఎన్నోసార్లు గొడవలు జరిగాయంటూ వార్తలు వచ్చేవి. కానీ వీళ్లిద్దరూ తాను మంచి స్నేహితులమని చెప్పేవారు.

మెగాస్టార్ చిరంజీవి-సుధాకర్- హరి ప్రసాద్, రజనీకాంత్-మోహన్ బాబు, శ్రీ విష్ణు- నారా రోహిత్, అర్జున్-జగపతిబాబు మధ్య కూడా మంచి స్నేహ బంధం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+