భర్తలకు ధీటుగా సంపాదిస్తున్న స్టార్ హీరోల భార్యలు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు అనగానే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ గుర్తుకొస్తారు. రోజురోజుకు వీరంతా తమ సినిమాల ద్వారా కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్నారు. ప్రాంతీయ హీరోల స్థాయి నుంచి గ్లోబల్ హీరోల స్థాయికి ఎదిగారు. బాక్సాఫీస్ ను వీరంతా షేక్ చేస్తుండగా, మరోవైపు వీరి భార్యలు వ్యాపార రంగంలో దూసుకువెళుతున్నారు. విజయవంతంగా వీళ్లు కోట్ల రూపాయల టర్నోవర్ ను సాధిస్తున్నారు. వారేం చేస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మహేష్ బాబు - నమత్ర శిరోద్కర్ : నమ్రత శిరోద్కర్ ఒకప్పుడు హీరోయిన్ గా రాణించింది. మహేష్ బాబును వివాహం చేసుకున్న తర్వాత కుటుంబానికే పరిమితమైంది. తాజాగా మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ ను చూస్తున్నారు. హంబుల్ అనే బ్రాండ్ తో టెక్స్ టైల్ రంగంలోకి అడుగుపెట్టారు. మరోవైపు ఏఎంబీ మల్టీప్లెక్స్ బాధ్యతలు కూడా సమర్థంగా నిర్వహిస్తున్నారు.

maheshbabu

జూనియర్ ఎన్టీఆర్ - లక్ష్మీ ప్రణతి : జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీప్రణతి గురించి బయటకు చాలామందికి వివరాలు తెలియవు. కానీ ఆమె త్వరలోనే ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ ను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మామ గతంలో స్టూడియో ఎన్ పేరుతో 24 గంటల న్యూస్ ఛానెల్ ను రన్ చేసిన విషయం తెలిసిందే.

jrntrpranathi

రామ్ చరణ్ - ఉపాసన : ఉపాసన గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇటీవలే వీరిద్దరూ ఒక పాపకు జన్మనిచ్చారు. అపోల్ హాస్పిటల్స్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు యువర్ లైఫ్ అనే హెల్త్ ఛానల్ ను రన్ చేస్తున్నారు. మరోవైపు ఎయిర్ లైన్స్ బిజినెస్ ను కూడా పర్యవేక్షిస్తున్నారు.

ramchanranupasana

అల్లు అర్జున్ - స్నేహ రెడ్డి : అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలకు డైరెక్టర్ గా ఉన్నారు. మరోవైపు సొంతంగా ఫొటో స్టూడియోను నిర్వహిస్తున్నారు. తాజాగా అమీర్ పేటలో ప్రారంభమైన ఏఏఏ సినిమాస్ మాల్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

alluarjunsnehareddy2

నాని - అంజనాదేవి : నాని సతీమణి అంజనాదేవి ఆర్కే మీడియాలో క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తున్నారు. బాహుబలి సినిమాకు కూడా పనిచేశారు. ఈమె గురించి బయట ప్రపంచానికి చాలా తక్కువమందికే తెలుసు.

nanianjana

అల్లరి నరేష్ - కంఠమనేని విరూప : అల్లరి నరేష్ భార్య కంఠమనేని విరూప కూడా వ్యాపారంలో రాణిస్తున్నారు. విరూప ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థను రన్ చేస్తూ విజయాల బాటలో ఉన్నారు. విజయవంతమైన వ్యాపారవేత్తగా ఈ రంగంలో ఆమె పలు అవార్డులను కూడా అందుకున్నారు.

allarinareshvirupa
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+