Sajjanar: ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా.. ఆ వీడియోపై ఏపీ పోలీసులను ట్యాగ్ చేసిన సజ్జనార్..!

సోషల్ మీడియాల వచ్చిన నుంచి కొంత మంది ఇష్టమొచ్చిట్లుగా చేస్తున్నారు. ముఖ్యంగా రీల్స్ చేసి ఫేమస్ అవ్వాలని చాలా మంది ట్రై చేస్తున్నారు. అయితే సాధారణ రీల్స్ ఎవరూ చూడరని.. వెరైటీగా వీడియో చేయాలని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. రీల్స్ ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం హయత్ నగర్ శివారులో బైక్స్ స్టంట్స్ చేస్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.

మరి కొంత మంది రోడ్డు పైనే బైక్ పై వెళ్తూ రోమాన్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాగే హైదరాబాద్ లో ఓ ఇన్ స్టాగ్రామ్ యూసర్ డబ్బులు పైకి వెదజల్లాడు. దీంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదే విషయమై సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కొంత మంది తమ ఇష్టమొచ్చినట్లు రీల్స్ చేస్తున్నారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

TGSRTC MD Sajjanar responded to the video which is going viral on social media

ఓ వ్యక్తి ఛాలెంజ్ చేశాడు. తాను ఆర్టీసీ బస్సును ఆపి వెంటనే పరుగెత్తా అని ఛాలెంజ్ చేశారు. అతను రోడ్డుపైకి వెళ్లాడు. అప్పుడే ఏపీఎస్ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు వచ్చింది. అతను బస్సు ఆపే ప్రయత్నం చేయడానికి చేయి ఊపడు. దీంతో బస్సు డ్రైవర్ సదరు వ్యక్తి బస్సు ఎక్కుతాడని భావించి బస్సు ఆపాడు. ఆ వ్యక్తి బస్సు ఎక్కినట్లే ఎక్కి.. వెనక్కు పారిపోయాడు. ఆ తర్వాత తాను ఛాలెంజ్ చేసి గెలిచినట్లు చెప్పాడు. ఫోలో అవ్వాలని కూడా కోరాడు.

ఈ వీడియోపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. "సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!? ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారు. లైక్ లు, కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి. బంగారు భవిష్యత్ వైపునకు బాటలు వేసి.. జీవితంలో ఉన్నతంగా ఎదగండి" అని ట్వీట్ చేస్తూ ఏపీ పోలీసులను ట్యాగ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+