Hyderabad: సంక్రాంతికి ఇంటికి తాళం వేసి ఊరు వెళ్తున్నారా.. అయితే ఈ వీడియో చూడండి..
తెలుగు ప్రజలకు ముఖ్యమైన పండుగాల్లో ఒకటి సంక్రాంతి. ముఖ్యం ఈ సంక్రాంతిని ఏపీ మరి ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో చాలా ఘనంగా నిర్వహిస్తారు. అందుకే సంక్రాంతి వచ్చిందంటే చాలు దాదాపు అందరూ సొంతుళ్ల బాట పడతారు. ఈ పండగ సందర్భంగా హైదరాబాద్ సగం ఖాళీ అవుతుంది. హైదరాబాద్ నుంచి దాదాపుగా 12 లక్షల మంది హైదరాబాద్ నుండి సొంత ఊర్లకు వెళతారని అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్
ఇందులో ఎక్కువగా ఏపీకి చెందిన వారు ఉంటారు. సంక్రాంతి పండుగకు అందరు సొంతుళ్లకు వెళ్లడంతో హైదరాబాద్ లోని చాలా కాలనీలు, అపార్టుమెంట్లు నిర్మానుష్యంగా మారుతాయి. దీంతో దొంగలు ఇదే అదునుగా భావించి చోరీలకు పాల్పడతారు. అందుకే ముందు జాగ్రత్త సైబారాబాద్ పోలీసులు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు.

బ్యాంకు లాకర్లు
ఊరు వెళ్లే వారు తమ బంగారు, వెండి ఆభరణాలను బ్యాంకు లాకర్లలో, డబ్బును బ్యాంకుల్లో పెట్టుకోవాలని సూచించారు. సెక్యూరిటీ అలరమ్, మోషన్ సీసీ కెమెరాలను అమర్చుకోవాలని కోరారు. సెన్సర్లను ఇంటి సెంట్రల్ లాక్ సిస్టమ్ కు అనుసంధానించుకోవాలని చెబుతున్నారు. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే స్థానిక పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలన్నారు.

డయల్ 100
మీ కాలనీలో ఎవరైనా అనుమానస్పందంగా తిరిగితే పోలీసులకు గానీ డయల్ 100కు తెలపండి. మీ వాహనాలను ఇంటి ఆవరణలో పార్క్ చేసుకోవాలని కోరారు. మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా హ్యాండిల్ లాక్ వేసుకోండి. చక్రలకు చైన్లతో లాక్ వేయండి. నమ్మకమైన వాచ్ మెన్లను మాత్రమే సెక్యూరిటీ గార్డుగా పెట్టుకోవాలి. మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్ లైన్ కు అనుసంధానించుకోండి.
పక్కవారికి
ఇంటి ముందు చెత్తాచెదారం, న్యూస్ పేర్లు, పాల పాకెట్లు లేకుండా చూసుకోవాలని చెప్పారు. ఇలా ఉంటే ఇంట్లో ఎవరు లేరని తెలిసిపోతుందని వివరించారు. అలాగే ఇంటికి తాళం వేసినప్పుడు బయట నుంచి కర్టెన్ ఉండేలా చూసుకోవాలని కోరారు. బయటకు వెళ్లటప్పుడు ఇంటి పక్కవారికి చెప్పి వెళ్లాలని సూచించారు.












Click it and Unblock the Notifications